News

ప్రపంచం చూపు చంద్రయాన్ వైపు ..

Srikanth B
Srikanth B
ప్రపంచం చూపు చంద్రయాన్ వైపు ..
ప్రపంచం చూపు చంద్రయాన్ వైపు ..

భారతదేశ గర్వాన్ని చెప్పే మధుర క్షణాలు దగ్గర్లో వున్నాయి .. భారతదేశా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పే చారిత్రాత్మక గడియలు ఇంకా కొన్ని గంటల్లో పార్రంభం కానున్నాయి .. భారతదేశనికి కీర్తిని తెచ్చే ఈ గడియలకోసం యావత్ భారతదేశ ప్రజానీకం ఎదురుచూస్తుంది.

చంద్రయాన్‌-3 ప్రయోగంలో అత్యంత కీలక దశ.. చంద్రుడిపై పరిశోధనలకు రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. జాబిల్లికి కూతవేటు దూరంలోనే ఉన్న చంద్రయాన్‌ విక్రం ల్యాండర్‌.. మరికొద్ది గంటల్లో చంద్రుడిపై ల్యాండ్‌ కాబోతోంది. విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన ల్యాండింగ్‌ మాడ్యూల్‌ ఇప్పటికే చంద్రుడికి మరింత చేరువైంది. అయితే.. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యే క్రమంలో చివరి 15 నిమిషాలు అత్యంత కీలకమంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

రూ. 2 లక్షల పంట రుణాలు తీసుకోండి.. డిసెంబర్ లో మాఫీ చేస్తాం

ప్రస్తుతం ల్యాండింగ్‌ మాడ్యూల్‌ను నిరంతరం తనిఖీ చేస్తూ.. నిర్దేశిత ల్యాండింగ్‌ ప్రదేశంలో దిగేందుకు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో తెలిపింది. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. బుధవారం సాయంత్రం సుమారు 5.45 గంటల తర్వాత ల్యాండింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. ఇస్రో శాస్త్రవేత్తల ప్రకారం.. సాయంత్రం 6.04గంటలకు చంద్రయాన్‌-3 జాబిల్లిపై దిగుతుంది.

రూ. 2 లక్షల పంట రుణాలు తీసుకోండి.. డిసెంబర్ లో మాఫీ చేస్తాం

Related Topics

chandrayana3

Share your comments

Subscribe Magazine

More on News

More