చాలామంది రైతులు తమ పంటకు పెట్టుబడి అవసరాల కోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటూ ఉంటారు. ఒకసారి పంట డబ్బులు చేతికి రాగానే బ్యాంకుకు వడ్డీ చెల్లించి బంగారంను వెనక్కి తీసుకుంటారు. ఇలా మన దేశంలో బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకునే రైతులు చాలామంది ఉన్నారు. ఇక చాలా బ్యాంకులు బంగారం తాకట్టుపై తక్కువ వడ్డీ రేటుకే రైతులకు ప్రత్యేకంగా వ్యవసాయ లోన్లు ఇస్తున్నాయి.
అయితే బంగారం ధరలు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. దేశయంగా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం, అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు తగ్గుతుండటంతో.. మన దేశంలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పడటంతో బంగారం ధరలు రూ.55 వేల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కానీ ఇప్పుడు బంగారం ధరలు పతనమవుతూ వస్తున్నాయి.
22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.43,000 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.400 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,900 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.450 తగ్గింది.
ఈ క్రమంలో బ్యాంకులు కూడా తక్కువ వడ్డీ రేటుకే గోల్డ్ లోన్లు ఇస్తున్నాయి. తక్కువ వడ్డీ రేటుకు గోల్డ్ లోన్ ఇస్తున్న బ్యాంకుల వివరాలు కింద చూడవచ్చు.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ - 7 శాతం.
బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.35 శాతం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 9.60 శాతం.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 7.50 శాతం.
కెనెరా బ్యాంక్- 7.65 శాతం.
కర్నాటక బ్యాంక్- 8.38 శాతం.
ఇండియన్ బ్యాంక్- 8.50 శాతం.
యూకో బ్యాంక్- 8.50 శాతం.
ఫెడరల్ బ్యంక్- 8.50 శాతం.
పంజాబ్ నేషనల్ బ్యాంక్- 8.75 శాతం.
యూనియన్ బ్యాంక్- 8.85 శాతం.
జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్- 8.90 శాతం.
సెంట్రల్ బ్యాంక్- 9.05 శాతం.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 9.25 శాతం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- 9.50 శాతం.
బ్యాంక్ ఆఫ్ బరోడా- 9.60 శాతం.
యెస్ బ్యాంక్- 9.99 శాతం.
ఐసీఐసీఐ బ్యాంక్- 10 శాతం.
Share your comments