ఈరోజు అక్షయ త్రితీయ కావడం తో బంగారం కు అత్యధిక డిమాండ్ ఉంటుంది, రేట్లు కూడా తగ్గాయి కాబట్టి పసిడి ప్రియులు కూడా హ్యాపీ.అయితే బంగారం ధర భవిష్యత్తులో ఇంకా కిందకి వచ్చే అవకాశం ఉందని, అంటే మల్లి 50 వేలకు రేట్లు పడిపోయే సూచనలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు, కారణాలు ఏంటో చుస్తే మీరు కూడా నిజమే అంటారు.
ప్రస్తుతం భారతదేశం లో బంగారం ధర పైకి కిందకి వెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే , మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు తాజా గా ఏప్రిల్ 22వ తేదీన చుస్తే 22 క్యారట్ల బంగారం 10 గ్రాములకు రూ . 56,050 మార్కు వద్ద నిలిచింది, 24 క్యారట్లు బంగారం అయితే 10 గ్రాములకు రూ. 61,150 గ్రాముల వద్ద నిలిచింది.పసిడి రేట్లు ఆకాశాన్ని అంటడం ఇదేం కొత్తకాదు, 2020 లో కూడా బంగారం 56,000 కు చేరింది అయితే కొద్ది రోజులలోనే రూ. 48,000 లకు పతనం అయింది . మల్లి అదే ట్రెండ్ తిరిగి వచ్చే అవకాశం ఉందని , కొన్ని రోజులలోనే బంగారం మల్లి కనిష్ట రేట్లకు చేరుకుంటుందని ప్రపంచ నిపుణులు చెప్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సమస్యగా మారింది. ప్రపంచంలోనే అన్ని దేశాలకు మాంధ్యం దెబ్బ తగిలింది.
ఇది కుడా చదవండి ..
అక్షరాలా కోట్ల రూపాయలు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప..
దీని నుంచి బయటపడేందుకు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అయినా అమెరికా, జర్మనీ, ఇటలీ, జపాన్, చైనా, రష్యా తమ అపారమైన బంగారు నిలువల నుంచి కొంత భాగాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉంది.2007 సంవత్సరంలో కూడా ఈ విధంగానే ప్రపంచ ఆర్థికంగా సమయంలో గ్రీస్, సైప్రస్ వంటి దేశాలు పెద్ద ఎత్తున బంగారాన్ని రిటైల్ మార్కెట్లో విక్రయించాయి. దీంతో మార్కెట్లో బంగారం ధర ఒకసారిగా తగ్గిపోయింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదే కనుక నిజమైతే బంగారం ధర మరోసారి 50వేలకు దిగివచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు, ఇప్పటికే 56 వేలకు తగ్గిన ధర 50 వేలకు తగ్గ డం కష్టమే . ఎం జరుగుతుందో చూడాలి. అలాగే బంగారం కొనాలని చూస్తునవారు మరి కొన్ని రోజులు వేచి చుస్తే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇది కుడా చదవండి ..
Share your comments