News

గోమాతకు సీమంతం చేసిన రైతు..

Srikanth B
Srikanth B



ప్రకృతికి మనిషికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది . ఈ క్రమంలో మనిషి తన అవసరాల కోసం సాదు జంతువులను పెంచుకోవడం ప్రారంభించాడు ఇందులో ముఖ్యమైనది ఆవు , ఆవు పాలనుంచి పెండ అన్ని అతిముఖ్యమైనవే అంత ప్రాముఖ్యత కల్గింది కనుకే హిందూ ధర్మంలో దీనిని గోమాత గ అభివర్ణిస్తారు . ఆవుపై ఉన్న ప్రేమకు ఆవుకు సీమంతం జరిపించిన వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది . ఇంతకీ అఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం !

 

 

టీవీ నైన్ కు అందించిన సమాచారం మేరకు పాడి పశువులు అంటే అమితమైన ప్రేమ కల్గిన మచిలీపట్నం చింతగుంట పాలెంలో గోవుకు రైతు పిప్పళ్ళ వెంకట కాంతారావు శ్రీమంత వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తన గోభక్తి చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి బంధు మిత్రులు ముఖ్య అతిధులుగా హాజరుకాగా.. వేద పండితుల సమక్షంలో ఈ గోమాత సీమంతం కార్యక్రమం వేడుకగా సాగింది. అందంగా అలంకరించిన గోవులను ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించి వాటికి సీమంతం నిర్వహించారు.

దేశపు మొదటి FPO కాల్ సెంటర్ ప్రారంభం ...

గోమాతకు పసుపు, కుంకుమలు రాసి.. కొత్త వస్త్రాలు సమర్పించుకున్నారు. గో ప్రదక్షిణలు చేశారు. ఈ గోమాత సీమంతం కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఇలాంటి ఘటన మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా కొందరు రైతు ఆవుమీద తమకు వున్నా ప్రేమను చాటుకోవడానికి చాల మంది రైతులు ఆవులకు సీమంతం జరిపించారు . పాడి పశువుల పట్ల వీరికి ఉన్న ప్రేమకు జనాలు ప్రేమను కురిపిస్తున్నారు .

దేశపు మొదటి FPO కాల్ సెంటర్ ప్రారంభం ...

Related Topics

Gomatha semantham

Share your comments

Subscribe Magazine

More on News

More