2023 సంవత్సరాన్ని ఐక్య రాజ్య సమితి "మిల్లెట్ ఇయర్ " చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే . భారతదేశమ్ చొరవతో ఐక్య రాజ్య సమితి చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాలు దీనిని అమలు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంబిస్తున్నాయి. దీనిలో భాగం గానే ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న బియ్యం బదులుగా రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయించింది .
ప్రస్తుతానికి రాయలసీమ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనునట్లు అధికారులు తెలిపారు. అక్కడ సక్సెస్ అయితే.. దశల వారీగా రాష్ట్రమంతటా ఈ విధానం అమలు అవ్వనుంది. ఐక్యరాజ్యసమితి కూడా 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన ఆ దిశగా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో.. గత నెల 18న సీఎం జగన్ సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. బియ్యం కంటే రాగులు, జొన్నలకు అయ్యే ఖర్చే తక్కువ.. అలాగే ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే రేషన్ బియ్యం బదులు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని సూచించారు.
ఇప్పటికే రేషన్ షాపుల్లో గోధుమ పిండిని కూడా పంపిణీ చేస్తోంది పౌరసరఫరాల శాఖ. కేజీ గోధుమ పిండి ప్యాకెట్ రేటును రూ.16 గా ఫిక్స్ చేశారు. విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం మునిసిపాలిటీల పరిధిలో సబ్సిడీపై గోధుమ పిండి అందజేస్తున్నారు. ఒక్కో కార్డుపై 2 కేజీల వంతున కిలో ప్యాకెట్లను రెండింటిని అందజేస్తారు .
ఈ చిన్న పొరపాటుతో 80 వేల రేషన్‌కార్డులు రద్దు.. ఈ పొరపాట్లు మీరు చేయకండి !
రాగులు ,జొన్నలు పంపిణి పై ఇప్పటికే ప్రజలనుంచి సూచనలను తీసుకున్న ప్రభుత్వం బియ్యం స్థానంలో జొన్నలు , రాగులు తీసుకోవడానికి ప్రజలు సుముఖముగా ఉన్నట్లు సమాచారం అయితే తొలుత రాయలసీమ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి ఒకవేళ ఇక్కడ ప్రాజెక్టు విజయం సాధిస్తే రాష్ట్రము అంతటా దీనిని అమలు చేయనున్నట్లు సమాచారం .
Share your comments