News

గుడ్ న్యూస్.. నేటినుండి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అల్పాహారం..! ఆరు రోజులు..ఆరు రకాలు..

Gokavarapu siva
Gokavarapu siva

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యార్థుల కోసం అద్భుతమైన విజయదశమి కానుకను అందించింది. ఈ చర్యలో భాగంగా, ప్రతిరోజు విద్యార్థులందరికీ పోషకమైన అల్పాహారం అందించనుంది. మునుపెన్నడూ లేని విధంగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం ఒక సంచలనాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.

దసరా పండుగ సందర్భంగా సద్భావన సూచకంగా, ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ "ముఖ్యమంత్రి అల్పాహార పథకం" ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు నుండి ప్రారంభించనున్నారు.

సాంబార్‌ ఇడ్లీ, పూరీ-ఆలూ కుర్మా, ఉప్మా, వెజిటబుల్‌ పలావ్, ఉగ్గాని.. ఇలా సర్కార్‌ బడులలో విద్యార్థులకు ఉచితంగా.. వేడి వేడిగా రోజుకో అల్పాహారం అందించేలా మెనూ ఖరారయ్యింది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'ముఖ్యమంత్రి అల్పాహారం' పథకం ప్రారంభించేందుకు అధికా రులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. మహేశ్వరం మండలం రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఇది కూడా చదవండి..

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ కొరకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

ఆరు రోజులు..ఆరు రకాలు
సోమవారం: ఇండ్లీ సాంబార్‌ లేదాపచ్చడితో కూడిన గోధుమరవ్వ ఉప్మా
మంగళవారం: ఆలూ కుర్మాతో పూరీ లేదా టమాటో బాత్‌ సాంబార్‌తో
బుధవారం: సాంబార్‌ ఉప్మా లేదా చట్నీతో కూడిన బియ్యం రవ్వ కిచిడీ
గురువారం: మిల్లెట్స్‌ ఇడ్లీ విత్‌ సాంబార్‌ లేదా సాంబార్‌తో పొంగల్‌
శుక్రవారం: ఉగ్గానీ, పోహా,మిల్లెట్‌ ఇడ్లీ విత్‌ చట్నీలో ఏదో ఒకటి లేదా గోధుమరవ్వ కిచిడీ చట్నీతో
శనివారం: సాంబార్‌తో పొంగల్‌ లేదా వెజిటబుల్‌ పలావ్, రైతా, ఆలూకుర్మా

ప్రస్తుతం పౌష్టికాహారానికి ప్రత్యామ్నాయంగా అందిస్తున్న రాగిజావ, ఉడకబెట్టిన కోడి గుడ్లను యథాతథంగా అందజేస్తూ పంపిణీ కొనసాగిస్తామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అందించాలని భావిస్తోంది. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి యేటా దాదాపు రూ. 400 కోట్ల అదనపు భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1 నుండి 10వ తరగతి చదువుతున్న 23 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది.

ఇది కూడా చదవండి..

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ కొరకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

Share your comments

Subscribe Magazine

More on News

More