ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని చదువుకునే విద్యార్థులకు అమ్మఒడి మరియు విద్యదివేన వంటి పథకాలు అమలులో ఉన్నాయి. రైతుల కోసం ఐతే రైతులను ఆర్ధికంగా ఆదుకోవడానికి రైతు భరోసా పథకం ద్వారా సహాయం అందిస్తుంది ప్రభుత్వం. వీటిల్లో వసతి దీవెన పథకం కూడా ఒకటి.
ఈ పథకం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. వసతి దీవెన పథకానికి అర్హులైన వారందరి ఖాతాల్లో ఈ సంవత్సరం విడత డబ్బులను జమ చేయడానికి ముహుర్తాన్ని నిర్ణయించారు. లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నెల 26న వసతి దీవెన డబ్బులను ముఖ్యమంత్రి జమ చేయనున్నారు.
ఈ నెల 26న అనంతపురం జిల్లాకు చెందిన శింగనమల నియోజకవర్గం నార్పల వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఖాతాల్లోకి వసతి దీవెన నగదును విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ముందుగా ఈ నెల అనగా ఏప్రిల్ 17న జరుగుతుందని అధికారులు తెలిపారు. కానీ, వసతి దీవెన కార్యక్రమం తేదిని వాయిదా వేసి ఈ నెల 26న ఫిక్స్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అందరూ పాల్గొటున్నారు.
ఇది కూడా చదవండి..
పెరుగుతున్న పత్తి ధరలు.. రైతులకు ఊరట
రాష్ట్రవ్యాప్తంగా వసతి దీవెన పథకం ద్వారా ప్రతి సంవత్సరం రెండు విడతల్లో అర్హులైన లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో డబ్బులను ప్రభుత్వం జమ చేస్తుంది. టీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ అభ్యసించే వారికి రూ. 20 వేల వరకు వసతి, భోజన, రవాణా ఖర్చుల కోసం వారి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుంది. అనంతపురం జిల్లా నార్పలలో ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభలో ఈ నెల 26న పాల్గొని వసతి దీవెన డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు.
వసతి దీవెన పథకానికి పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ ఆపై చదువులు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, యూనివర్శిటీలు, బోర్డుల్లో చదివేవారు అర్హులు. కచ్చితంగా ఈ విద్యార్థులకు 75 శాతం హాజరు అనేది ఉండాలి.
ఇది కూడా చదవండి..
Share your comments