తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్య మంత్రి DBT (Direct Benefit Transfer) ద్వారా ఇకపై ఇచ్చే ఉచిత విద్యుత్ డబ్బుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని ముఖ్యమంత్రి హామీయిచ్చారు. దీంతో కరెంటు బిల్లులు అన్నీ ఇకపై రైతులే నేరుగా చెల్లిస్తారని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా విద్యుత్ సేవల్లోని నాణ్యతను రైతులు నేరుగా ప్రశ్నిస్తారని వెల్లడించారు .
దీంతో పాటుగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సప్లై, డిమాండ్, వినియోగం తదితర అంశాలపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వీటిని పూర్తి చేసేందుకు అవసరం అయిన నిధుల సమీకరణపై చర్చించారు. నిధుల కొరత ఉన్నా ప్రాజెక్టులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని తెలిపారు .
నిరంతరం విద్యుత్ సరఫరాతో విద్యుత్ ఆదా అవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నిపుణులు గ్రహించారని గుర్తు చేశారు. సరఫరా పెంచే బాధ్యతను అధికారులు తీసుకోవాలని కోరారు.
ఇక విద్యుత్ ఉత్పత్తి కోసం ముఖ్యంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్లపై ఆధారపడిన నేపథ్యంలో బొగ్గు సప్లైకి అవాంతరాలు కలగకుండా చూడాలని కోరారు. ఇందు కోసం అవసరం అయితే కేంద్ర రైల్వే శాఖతో చర్చించాలని సూచించారు.
ఇక పారిశ్రామిక రంగానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. దీంతో పాటుగా గృహ వినియోగదారులకు కూడా ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ ఉద్యోగులపైనే ఉందని తేల్చిచెప్పారు.
12 సంవత్సరాల పైబడిన వారందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్!
అయితే ఏపీలో పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పవర్ హాలిడే ఉందని ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సీఎం అవసరం అయితే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని సూచించారు. విద్యుత్ కొనుగోలు కొరత లేకుండా చూడాల్సిన బాద్యత అధికారులపైనే ఉందని వెల్లడించారు .
తెలంగాణలో అకాల వర్షం ... రైతులు తీవ్ర నష్టం !
Share your comments