భారత్ లో పండుతున్న అరటి మరియు బేబీ కార్న్ లను కెనడా దేశానికి ఎగుమతి చేయడానికి అనుమతులు లభించాయి
భారతీయ అరటి, బేబీ కార్న్‌లను కెనడా దేశ మార్కెట్లలోకి అనుమతించే విషయమై (National Plant Protection Organisations of India) నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా, కెనడా మధ్య జరిగిన చర్చలు ఫల ప్రదమయ్యాయి. భారత్ లో పండే అరటి మరియు బేబీ కార్న్ లకి కెనడా మార్కెట్‌లలోకి విక్రయించేందుకు గాను తగు మార్గం సుగమమైంది. 07.04.22న డీఏ&ఎఫ్‌డబ్ల్యుకార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా మరియు కెనడా హైకమిషనర్ హెచ్.ఈ కామెరాన్ మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతర కెనడా D-95-28:(Plant Protection Import and Domestic Movement Requirements for Corn and the Automated Import Reference System ) ప్లాంట్ ప్రొటెక్షన్ ఇంపోర్ట్ అండ్ డొమెస్టిక్ మూవ్‌మెంట్ రిక్వైర్‌మెంట్స్ ఫర్ కార్న్ అండ్ ఆటోమేటెడ్ ఇంపోర్ట్ రిఫరెన్స్ సిస్టమ్ (ఏఐఆర్ఎస్) ఆదేశాన్ని నవీకరించింది. దీని ఫలితంగా భారతదేశం నుండి కెనడాకు తాజా బేబీ కార్న్ ఎగుమతులు ఈ నెల (ఏప్రిల్ 2022) నుండి ప్రారంభమవుతాయి.
దీనికి తోడు భారతదేశం లో ఉత్పత్తి అయ్యే తాజా అరటిపండ్లకు సంబంధించిన సాంకేతిక సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో అందుతున్న సమాచారం ఆధారంగా భారత అరటి పండ్లు కెనడా మార్కెట్ల ప్రవేశానికి తక్షణమే అనుమతులు అమలులోకి రాబోతున్నాయి.అరటి భారతదేశంలోని అనేక ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో ముఖ్యమైన పండ్ల పంట. ఇది భారతదేశంలో 830.5 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది మరియు మొత్తం ఉత్పత్తి సుమారు 29,779.91 వేల టన్నులు. అరటి పండించే ప్రధాన రాష్ట్రాలు తమిళనాడు,ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర, గుజరాత్, మరియు కర్ణాటక.
కెనడా ప్రభుత్వం యొక్క ఈ నిర్ణయం ఈ పంటలను పండించే భారతీయ రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది మరియు భారతదేశ ఎగుమతి ఆదాయాలను కూడా పెంచుతుంది.
మరిన్ని చదవండి.
Share your comments