రోజు రోజు పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న వినియోగదారులకు శుభవార్త అందించండి ప్రభుత్వం . అంతర్జాతీయ మార్కెట్లో నూనె ధరలు తగ్గు ముఖం పడుతున్న వేళ వంట నూనెల ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన వంట నూనెల గరిష్ట రిటైల్ ధరను లీటరుకు రూ.8-12 తగ్గించాలని స్పష్టం చేసింది.
నూనె ధరల అంశంపై సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సహా పరిశ్రమ ప్రతినిధులతో ఫుడ్ సెక్రటరీ సంజీవ్ చోప్రా అధ్యక్షతన జరిపిన సమీక్షా సమావేశం అనంతరం ధరల తగ్గుదలకు సంబందించిన ఈ విషయాలను ఆహార మంత్రిత్వ శాఖ వెల్లడించింది .
రాష్ట్రంలో 4 రోజులు మోస్తరు వానలు ..
ఉత్పత్తి దారులు , రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ఇచ్చే ధర కూడా తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది . , ఉత్పత్తి దారులు రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ధర తగ్గింపు జరిగినప్పుడల్లా.. విక్రేతల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం అందడంతోపాటు మంత్రిత్వ శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలి అని వెల్లడించింది.
అంతర్జాతీయ మార్కెట్లో నూనె ధరలు భారీగా పెరిగాయి దీనితో నూనె ధరలు దేశవ్యాప్తంగా భారీగ పెరిగిపోయాయి దీనితో సామాన్యుల జేబులకు చిల్లులు పడాయి .ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో నూనె ధరలు తగ్గుముఖం పడుతుండడంతో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉందని ఆహార మంత్రిత్వ శాఖ వెల్లడించింది . అయితే నూనె ధరల తగ్గుదల వార్త సామాన్యులకు కాస్త ఊరట కల్గించే అంశం .
Share your comments