యాసంగి కోతలు ముగిసి త్వరలో వానాకాలం పంటల సాగు కోసం రైతులు సన్నదం అవుతున్న వేల నిన్న కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక సమావేవాహాన్ని నిర్వహించింది , ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నవేళ రైతులకు అవసరమయ్యే ఎరువుల లభ్యత ధరపై సమీక్షా సమావేశం నిర్వహించింది , ఈ సమావేశంలో రైతులపై ఎరువుల భారం పడకుండదని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు వానాకాలం సీజన్ లో ఎరువులకు రూ.1.08 లక్షల కోట్ల రాయితీ కొనసాగించాలని నిర్ణయించింది మంత్రివర్గం. అదేవిధంగా యూరియాకు రూ.70 వేల కోట్ల రాయితీ కల్పించాలని, డీఏపీకి రూ.38 వేల కోట్ల రాయితీ ఇవ్వాలని డిసైడ్ చేసింది. గత సంవత్సరం ఎరువుల రాయితీకి రూ.2.56 లక్షల కోట్లు ఖర్చు అయిందని కేంద్రం తెలిపింది. అయితే రాయితీ మాత్రం తగ్గింది దీనితో రానున్న రోజులలో ఎరువుల ధరలు పెరుగుతాయా లేదా ప్రభుత్వం సబ్సిడీ ను పెంచనుందా అనేది అధికారిక ప్రకటన తరువాత తెలిసే అవకాశం వుంది .
ఇది కూడా చదవండి .
కట్నం అడిగినా, తీసుకున్నా డిగ్రీ రద్దు! తెలంగాణ లో కూడా అమలు అవ్వనుందా?
ప్రస్తుతం ఎరువుల ధరలు ;
- DAP - రూ.1500 / 50 కిలోలు
- యూరియా- రూ.370 / 50 కిలోలు
- సింగిల్ సూపర్ ఫాస్ఫేట్రూ -.420.00 / 50 కిలోలు
- మ్యూరియేట్ ఆఫ్ పోటాష్ - .980.00 / 50 కిలోలు
- 10:26:26 -రూ.1200.00 / 50 కిలోలు
- 17:17:17 - రూ.900.00 / 50 కిలోలు
- 15:15:15 -రూ.1100.00 / 50 కిలోలు
- జింక్ సల్ఫేట్ -రూ.58.00 / కిలో
కాపర్ సల్ఫేట్ - రూ.190.00 / కేజీ - 20:20:0 -రూ.850.00 / 50 కిలోలు
- 16:20 - రూ.780.00 / 50 కిలోలు
- మాంగనీస్ సల్ఫేట్ -రూ.80.00 / కేజీ
- మెగ్నీషియం సల్ఫేట్- రూ.110.00 / కిలో
ఫెర్రస్ సల్ఫేట్ - రూ.15.00 / కిలో - బోరాక్స్ (20 %) - రూ.101.00 / 250 గ్రా
గమనిక : ఈ ఎరువుల ధరలు అంతర్జాలంలోని ప్రామాణికమైన సైట్ నుంచి సేకరించబడినది , ప్రదేశాన్ని బట్టి ధరలు మారవచ్చు .
Share your comments