News

రైతులకు శుభవార్త : ఈ పంటకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం !

Srikanth B
Srikanth B
Good news for farmers: Center has increased the minimum support price for jute
Good news for farmers: Center has increased the minimum support price for jute

 

కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించింది. కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల చాలా మంది అన్నదాతలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

కేంద్రప్రభుత్వం తాజాగా ముడి జనపనార కనీస మద్దతు ధరను క్వింటాకు రూ. 300 పెంచింది దీనితో ముడి జనపనార కనీస మద్దతు ధర రూ. 5050కు చేరింది 2023- 24 సీజన్‌కు సంబంధించి ఈ రేటు వర్తించనుంది .

 


కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) సిఫార్సుల మేరకు కనసీ మద్దతు ధరను పెంచామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ముడి జనపనార కనీస మద్దతు ధర ఇప్పుడు క్వింటాకు రూ. 5050 గా నిర్ణయించారు.

రబి పంటలు వాటి మద్దతు ధరలు :2022-23

 

 

గోధుమలు

2015 (2021-22)

బార్లీ

1635 (2021-22)

శనగలు

5230  (2021-22)

మసూర్ (ఎర్ర పప్పు)

5500   (2021-22)

ఆవాలు

5050   (2021-22)

సన్ ఫ్లవర్

6400   (2021-23)

ఎండు కొబ్బరి

11000 (2021-23)

జంపర్

4750    (2021-23)

గమనిక :
గోధుమలు,బార్లీ ,శనగలు ,మైసూర్ ,ఆవాలు పంటలు సాగు ఇప్పుడే జరిగింది కావున , పంట కోతకు వచ్చే వరకు 2022-23 కు కనీస మద్దతుధర ప్రకటించబడుతుంది.

Related Topics

2500 MSP

Share your comments

Subscribe Magazine

More on News

More