తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ఒక శుభవార్తను అందించింది. ఎన్నికల సమయంలో, తెలంగాణలోని రైతులకు అనుకూలమైన ప్రకటన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు నిధుల కేటాయింపునకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పాటు ఎన్నికల సంఘం నుండి వచ్చిన ముఖ్యమైన ఆదేశాలతో పాటు రైతు బంధు నిధుల పంపిణీని ప్రస్తుత నెల 28వ తేదీ వరకు అనుమతించింది. నవంబర్ 28 సాయంత్రం రైతు బంధు పంపిణీని నిలిపి వేయాలని ఆదేశించింది.
కాగా తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.10వేలు అందిస్తున్న విషయం మనకి తెలిసిందే. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వం అనుకున్న ప్రకారం రెండు విడతలుగా రబీ సీజన్‌కు సంబంధించిన సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయలేకపోయింది.
రైతులకు ఈ సాయం ఎంత అవసరమో గుర్తించిన ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను అనుమతి కోరింది. అయితే, ప్రభుత్వం రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతి కోరగా.. కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు నిధుల విడుదలకు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది.
ఇది కూడా చదవండి..
ప్రపంచదేశాలను కలవరపెడుతోన్న చైనా కొత్త వైరస్.. అదేమిటంటే?
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన నిధులు ఇప్పటికే జమ చేసినప్పటికీ, యాసంగి సీజన్ కోసం రెండో విడత నిధులు నవంబర్‌లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్‌తో ఈ నిధుల విడుదల ఆగిపోయింది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం తెలపడంతో ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.
ఖరీఫ్ సీజన్‌లో, ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు రైతుబంధు సహాయం అందించింది, అదనంగా 1.5 లక్షల మంది రైతులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దాదాపు 1.54 కోట్ల ఎకరాల భూమిని రైతుల ఖాతాల్లోకి రూ.7700 కోట్లకు పైగా జమ చేశారు.
ఇది కూడా చదవండి..
Share your comments