News

రైతులకి భారీ శుభవార్త… మే నుండి ఏడాదికి 20 వేలు… ఆ కార్డు లేకున్నా పర్లేదా? అన్నదాత సుఖీభవ పధకం అప్డేట్

KJ Staff
KJ Staff

అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకి ఒక సంవత్సరానికి గాను 20 వేల రూపాయిలు పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులతో కలుపుకొని మొత్తం 20 వేల సాయం రైతులకి దొరకనున్నది అని ప్రకటించారు. 

అలానే సీసీఆర్ కార్డులు లేకపోయినా కూడా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మే నేలనుండి ఈ పధకం సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభం కానుంది.

అసెంబ్లీ లో మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ పథకం కింద 20 వేల రూపాయలు అందిస్తామని పునరుద్ఘాటించారు. పీఎం కిసాన్ పథకం తో కలుపుకొని పూర్తి 20 వేలు పెట్టుబడి సాయం గా రైతులకి అందనున్నది కీలక ప్రకటన చేశారు. అంతే కాకుండా నిరుపేద రైతుల కి డ్రిప్ లు, స్ప్రింక్లర్ లు, యాంత్రీకరణ కూడా అందిచడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ పథకం మే నెల నుండి అమలుకానున్నట్టు వెల్లడించారు.  

అంతే కాకుండా సీసీఆర్ కార్డులు లేకపోయినా కూడా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ-పోర్టల్‌లో నమోదు చేసుకున్నవారికి అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం బడ్జెట్‌లో రూ.9,400 కోట్లు కేటాయించారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం వెబ్ ల్యాండ్ లో నమోదు చేసుకున్న 42 లక్షల మంది రైతులకి మాత్రమే సాయం చేస్తోంది అని, కానీ కౌలు రైతులకి సాయం అందండం లేదు అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అందుకనే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తో కలిసి అర్హులైన రైతులందరికి 20 వేలు అన్నదాత సుఖీభవ పథకం కింద చేరేటట్టు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తుందని అసెంబ్లీ లో మాట్లాడుతూ వెల్లడించారు. 

అలానే వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడాదికి కేవలం రూ.7,500 ఇచ్చి మిగతా పథకాలన్నీ ఆపేశారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం 1640 కోట్లు అప్పు చేసి పోయిందని, తమ ప్రభుత్వం అలంటి మోసం చెయ్యదని తీర్మానించారు.  అందుకే కూటమి ప్రభుత్వం ఇచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అర్హత గల ప్రతి రైతుకి ఏడాదికి, కేంద్రంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తర సమయంలో మాట్లాడుతూ ప్రకటించారు.

Share your comments

Subscribe Magazine

More on News

More