తెలంగాణా రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్తను అందించారు. కొల్లాపూర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ శుభవార్తను రైతులకు తెలియజేసారు. రానున్న కాలంలో రైతు బంధు ఏకరానికి పదహారు వేలకు పెంచుతామని ఆయన ప్రకటించారు. రానున్న రోజుల్లో రైతు బంధు 16వేలకు పెంచాలంటే.. బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలి అని అన్నారు. రైతులు అప్పులు పాలు అవుతారని రైతు బంధం ఇస్తున్నామన్నారు కేసీఆర్.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ఏర్పాటు చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేసారు. కొల్లాపూర్లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ చాలా కాలంగా వెనుకబడిన ప్రాంతంగా పరిగణించబడిందని అన్నారు. రైతులకు అందిస్తున్న రైతు బంధు వేస్టా ? అని జనాన్ని ప్రశ్నించారు. రైతు బంధు ఉంటుందన్నారు.
భవిష్యత్తులో ఎకరాకు పదహారు వేల రూపాయలు అందజేస్తామని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ రైతులకు సానుకూల ఫలితం ఉంటుందని కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేసారు. రైతులు అప్పులు పాలు అవుతారని రైతు బంధం ఇస్తున్నామన్నారు కేసీఆర్. ఈ దీక్షను కేవలం రాజకీయ వ్యూహాలతో కాకుండా జీవనోపాధిగా పోలుస్తూ రైతులకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నామని కేసీఆర్ వివరించారు.
ఇది కూడా చదవండి..
మ్యానిఫెస్టో విడుదల చేసిన బీజేపీ పార్టీ: కీలక హామీలు ఇవే
ఇది రాజకీయం కాదు.. తెలంగాణ జీవన్మరణ సమస్య అన్నారు కేసీఆర్. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ముందుకు రాలేదన్నారు. పక్కనే కృష్ణా నది ఉన్నా నీళ్లు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో మూడు గంటలు కరెంట్ సరిపోతుందా? అని అడిగారు. ప్రజలకు 24 గంటలు కరెంట్ కావాలా వద్దా అని ప్రశ్నించారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మూడు గంటలు కరెంట్ చాలు అంటున్నారని విమర్శించారు కేసీఆర్.
ఎన్టీఆర్ హయాంలో కిలో రెండు రూపాయలకు తక్కువ ధరకు బియ్యాన్ని అందించడాన్ని ఎత్తిచూపిన కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యం ఎంతవరకు సార్థకత అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యానికి సమానమైన దరిద్రపు రాష్ట్రం మరొకటి లేదని ఆయన వాదించారు. అప్పుడు దిక్కు లేక ముంబైకు పోయాం. ఇప్పుడు మరోసారి అలాంటి గతే మళ్లీ పట్టాలా ? అని ప్రశ్నించారు. పదేళ్ల క్రితం మీకు నీరు రావన్నారు. ఇప్పుడు నీళ్లు సాధించి… 24 గంటలు కరెంట్ సాధించింది ఎవరో అని ప్రశ్నించారు కేసీఆర్.
ఇది కూడా చదవండి..
Share your comments