రాష్ట్రంలో సాగు చేసిన యాసంగి జొన్న పంటను సేకరించి, మద్దతు ధరకు కూడా చెల్లించాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇటీవల రైతుల వద్దనుండి యాసంగి మొక్క జొన్న పంట కొనుగోళ్లు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సారి కనీస మద్దతు ధర క్విన్టకు రూ. 1,962 ఇస్తున్నట్టుగా ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర కార్యక్రమాలు నిర్వహించే ప్రథమిక సంస్థగా మార్క్ ఫెడ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా, 2022-23 యాసంగి సీజన్‌లో సాగు చేసిన హైబ్రిడ్ జొన్న పంటకు మద్దతు ధర అందించడం ద్వారా కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పంట కొనుగోలుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ యాదిరెడ్డిని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రలో మొక్క జొన్న పండించే రైతులకు గత సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ని పొడిగిస్తూ ఈ సంవత్సరం కూడా యాసంగి లో పండిన మొక్క జొన్న పంటను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. కనీస మద్దతు ధర పోయిన ఏడాది 2021- 22 లో రూ. 1870/- ఉండగా 2022-23 కి 92 రూపాయలు పెంచి 1,962/- క్వింటాల్ కు ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం.
ఇది కూడా చదవండి..
రైతులకు శుభవార్త: మే 18 వరకు రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ
యాసంగి సీజన్లో పండిన మొత్తం 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు అవసరమున్న రూ. 219. 92 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటి ఇవ్వనుంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నిర్మల్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్,గద్వాల్, నారాయణపేట, గద్వాల్ వికారాబాద్, జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జొన్న పంటలు సాగు చేసిన సుమారు లక్ష మంది రైతులకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా లాభం జరగనుంది.
ఇది కూడా చదవండి..
Share your comments