కేంద్ర ప్రభుత్వం ఇటీవలి దేశంలోని రైతులందరికీ శుభవార్త అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఖాతాల్లో ఎప్పుడు పడతాయా అని రైతులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పథకం యొక్క 14వ విడత గురించి ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత జూలై 27న విడుదల చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది .
ప్రధాన మంత్రి మోదీ రాజస్తాన్‌లోని సికార్‌లో జరగనున్న కార్యక్రమం వేదికగా రైతుల ఖాతాల్లో ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం యొక్క 14వ విడత నిధులను జమ చేయనున్నారు. అయితే రైతులు మాత్రం ఓ విషయం గుర్తుంచుకోవాలి. పీఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే, రైతులకు తగిన అర్హతలు పక్కా ఉండాలి. దాంతో పాటు కొన్ని పనుల్ని కూడా చేసేయాలి. లేదంటే డబ్బులు పడవు.
ఇది కూడా చదవండి..
తెలంగాణ బడి వేళల్లో మార్పులు.. విద్యాశాఖ కీలక నిర్ణయం..
పీఎం కిసాన్ 14 విడత స్టేటస్ ఎలా చెక్ చేయాలి ?
https://pmkisan.gov.in/ అనే వెబ్సైటు ను సందర్శించి. క్రింద కనిపించే ఫార్మర్ కార్నర్ లో KNOW YOUR స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి . తరువాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిస్తే రిజిస్టేషన్ నెంబర్ టైపు చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చ పై ఎంటర్ చేసి గెట్ డేటా పై క్లిక్ చేయాలి అంతే ఇప్పుడు మీరు మీ స్క్రీన్ పై స్టేటస్ పొందుతారు . ఒక వేల రెజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే పక్కనే ఉన్న నో రిజిస్టరైన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి ఆధార్ ఇంకొకటి మొబైల్ నెంబర్ రెండిటిలో ఏదయినా టైపు చేసి మీరు పై రిజిస్టరైన్ నెంబర్ పొందుతారు. ఈ రిజిస్టేషన్ నెంబర్ తో ఇప్పుడు మీరు సులువుగా స్టేటస్ చెక్ చెయ్యవచు.
మరోవైపు రైతులు ప్రధానమంత్రి కిసాన్ యోజన కోసం తమ KYCని అప్‌డేట్ చేసి లబ్ది పొందవచ్చు . OTP-ఆధారిత సాంకేతికతను ఉపయోగించి లబ్ధిదారులు MKISAN పోర్టల్‌లో eKYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments