రైతులను ఆదుకొని పంట సాగును ప్రోస్తహిందడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాయి. ఈ వివిధ రకాల పథకాల వల్లా రైతులు ఆర్ధికంగా బలపడి పంటలను సాగు చేస్తున్నారు. దీనితో పాటు రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణి చేయడం మరియు పంటకు వాడే ఎరువులపై సబ్సిడీలను అందించడం ఈ విధంగా అనేక రకాలుగా ప్రభుత్వాలు రైతులకు అండగా నిలుస్తున్నాయి.
ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. రైతులను ఆర్ధికంగా ఆదుకోవడానికి వారికీ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తుంది. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులను ఆర్బికే ల ద్వారా రైతులకు పంపిణి చేస్తుంది. అయితే ఈ రైతు భరోసా డబ్బులను త్వరలో రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
2023-24 సంవత్సరానికి సంబంధించి పంటలు పండించడానికి ఖరీఫ్ సీజన్‌కు రైతులు జూన్ నెల నుండి ఏర్పాట్లు మొదలు పెడతారు. కాబట్టి రైతులకు ఆ పంటలను పండించుకోవడానికి అవసరమైన ముందస్తు పెట్టుబడులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ కింద 2023-24 సంవత్సరానికి అందించాల్సిన మొదటి విడత సొమ్మును మే నెలలో విడుదల చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇది కూడా చదవండి..
రైతులకి గుడ్ న్యూస్.. ఈ కేంద్ర పథకంతో రూ.15 లక్షలు..!
ప్రస్తుతం ఈ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మరొక అవకాశాన్ని ఇచ్చింది. రైతుభరోసా సైట్‌లో గ్రీవెన్స్‌లో దరఖాస్తులు స్వీకరించేందుకు చర్యలు తీసుకుంది. ఏదైనా కారణం చేత పథకం వర్తించకపోతే తమ సమీప రైతుభరోసా కేంద్రంలోని వీఏఏను సంప్రదించి గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
ఎవరైనా రైతులకు ఈ పథకానికి అర్హత ఉండి వారికి డబ్బులు అందకపోతే లేదా కొత్తగా పొలం పాస్ బుక్ చేయించుకున్న దానికి సంబంధించిన పత్రాలు తీసుకోని వెంటనే రైతు భరోసా పథకంకు అప్లై చేసుకోండి. ఒకవేళ రైతులు తమ భూమికి కొత్త పాస్ బుక్ పొందితే, దానికి ఆధార్ లింక్ కచ్చితంగా చేయించుకోండి.
ఇది కూడా చదవండి..
Share your comments