ఈ సంవత్సరం పత్తి రైతులకు అంతగా కలిసి రాలేదు తగ్గినా దిగుబడి , కలిసిరాని మద్దతుధరతో రైతులు నష్టపోయారు అయితే అధిక దిగుబడి రాకపోవడానికి ప్రకృతి వైపరీత్యాలు కారణమైతే దానికి తోడుగా నకిలీ విత్తనాలు కూడా తయారయ్యాయి. ఇన్ని రోజులు తగ్గుముఖం పట్టిన పత్తి ధర కాస్త పెరిగింది. మార్కెట్లో నెల రోజులుగా తగ్గిన పత్తి ధర క్రమంగా పెరుగుతోంది.
కర్నూలు మార్కెట్ లో పత్తి ధరలు పెరిగాయి. అకాల వర్షాల కారణంగా పంటను నష్టపోయిన రైతులకు, ఈ పత్తి ధరల పెరగడం అనేది ఊరట కలిగిస్తుంది. కర్నూలు మార్కెట్ లో పత్తికి డిమాండ్ అమాంతంగా పెరిగింది. ఈ ఆదోని పత్తి మార్కెట్ సుమారుగా ఏడు జిల్లాలకు ప్రధాన మార్కెట్ గా ఉంది. ఈ విషయం తెలుసుకున్న రైతులు కొంత మేర ఉపశమనం పొందుతున్నారు.
జాతీయంగా మరియు అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ పెరగడం వాళ్ళ మరియు మార్కెట్ లో సరఫరా లేనందున పతి ధరలు బాగా పెరిగాయి. మార్కెట్ లో క్వింటా పత్తి ధర అనేది గరిష్టంగా రూ. 8,169 పలుకుతోంది. పత్తి ధరలు పెరగడానికి వ్యాపారుల మధ్య పోటీ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కారణం ఏదైనప్పటికీ ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రస్తుతం పత్తి సీసన్ కూడా ముగుస్తుంది. రానున్న రోజుల్లో పత్తికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..
పతనమైన ఉల్లి ధర.. ఇప్పుడు కిలోకి ఎంతనో తెలుసా!
కర్నూలు ఆదోని మార్కెట్‌లో రికార్డు స్థాయికి చేరాయి. ఇక్కడ వ్యాపారులు అధిక ధరలు చెల్లించి మరి పత్తిని కొనుగోలు చేస్తున్నారు, ఎందుకంటే పత్తికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ ఉంది. ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు కారణమైతే దానికి తోడుగా నకిలీ విత్తనాల కారణంగా ఎకరానికి 5 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో క్వింటా పత్తికి రూ.8 వేలకు పైగా పలుకుతుంది.
ఇది కూడా చదవండి..
Share your comments