ఒఎన్‌జిసి పైప్‌లైన్ వల్ల ఆదాయాన్ని కోల్పోయిన మత్స్యకారులకు ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ ప్లాట్‌ఫాం ద్వారా నిధులు పంపిణీ చేశారు. ఒఎన్‌జిసి పైప్‌లైన్ ఫలితంగా జీవనోపాధిని కోల్పోయిన మత్స్యకారుల కోసం ముఖ్యమంత్రి జగన్ నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మొదట సూళ్లూరుపేటలో నిర్వహించాలని అనుకున్నామని, అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చిందని సీఎం జగన్ వివరించారు.
ప్రభుత్వం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అలాగే తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీసి, తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నామని, ఆ కార్యక్రమం వీలునుబట్టి ఈ నెలాఖరులోనో, వచ్చే నెలలోనో చేపడతామని సీఎం జగన్ అన్నారు.
గోదావరి జిల్లాలు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన 16,408 మంది, కాకినాడ జిల్లాకు చెందిన మరో 7,050 మంది సహా మొత్తం 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలు ప్రస్తుతం ఒఎన్‌జిసి పైప్‌లైన్ వల్ల నష్టపోయిన నష్టానికి పరిహారం పొందుతున్నాయని సిఎం జగన్ ఇటీవల వెల్లడించారు.
ఇది కూడా చదవండి..
రైతులకు శుభవార్త.. రైతుబంధు నిధుల పంపిణీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్!
నెలకు రూ.11,500 చొప్పున చెల్లించే ఈ కార్యక్రమం గురించి ఓఎన్జీసీతో మాట్లాడామన్నారు. వారి తరఫున ఓఎన్జీసీతో మాట్లాడి 3 దశల్లో రూ.323 కోట్లు నష్టపరిహారం ఇప్పటికే ఇప్పించామన్నారు. 4వ విడత ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.161 కోట్లు పరిహారం ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం జరుగుతోందన్నారు.
ఇన్సూరెన్స్ లేదని తెలిసిన వెంటనే మత్స్యకార కుటుంబాలకు మంచి జరగాలని బోటు విలువ లెక్కగట్టమని చెప్పి 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని సీఎం జగన్ తెలిపారు. ఆ చెక్కులు ఈరోజే పంపిణీ చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించామన్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments