ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హోలీ పండుగ సందర్భముగా ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఈ స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ పథకం కింద రూ. 10 వేలు పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం అందించే ఈ రూ. 10 వేలను హోలీ పండుగ ముందు నుండే పొందే అవకాశం కూడా ఉంది. ఈ డబ్బులను ప్రభుత్వ ఉద్యోగులు మర్చి 31వ తేదీ లోపు ఎప్పుడైనా పొందే అవకాశం ఉంది. కానీ మర్చి నెల దాటితే ఈ డబ్బులను ఉద్యోగి పొందలేదు. ఉద్యోగులు తీసుకున్న రూ. 10 వేలకు కేంద్ర ప్రభుత్వం ఎంటువంటి వడ్డీ వేయదు. కాబట్టి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు.
ఈ డబ్బులను పొందడానికి ఉద్యోగులు ఎటువంటి పని చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ముందుగానే ఉద్యోగుల ఖాతాలకు కేంద్ర బుప్రభుత్వం రిజిస్టర్ చేసి ఉంచుతుంది. పోయిన సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొరకు దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉద్యోగులు తీసుకున్న ఈ రూ.10 వేలను ఒక్కసారిగా కట్టవలసిన అవసరం లేదు. ప్రతి నెలకు రూ. 1000 చొప్పున, అలా 10 నెలల్లో ఈ రూ.10 వేలను చెల్లించవచ్చు. ఈ రూ.10 వేలకు వడ్డీ కూడా లేదు.
ఇది కూడా చదవండి..
విదేశాలకు భారీగా పెరిగిన ఉల్లి ఎగుమతులు..
కానీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.10 వేలను మనం క్యాష్ రూపంలో పొందలేము. ఈ 10 వేళా రూపాయలను ఆ ఉద్యోగి కేవలం డిజిటల్ రూపంలోనే వినియోగించాల్సి ఉంటుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. కాగా ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు అందించిన మొత్తం డబ్బుపై బ్యాంక్ ఛార్జెస్ను కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ పథకానికి సుమారుగా రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్లను కేటాయిస్తుంది.
ఇది కూడా చదవండి..
Share your comments