కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగులకు శుభవార్త తెలపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏని త్వరలో పెంచే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని మార్చిలో పెంచిన విషయం మనకి తెలిసిందే.
పోయినసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏను జూలై 2021లో పెంచడం జరిగింది. దీనితోపాటు డియర్‌నెస్ అలవెన్స్ (DA)ని మొదటిసారిగా 25 శాతం నుండి 28 శాతానికి పెంచింది. ఇప్పుడు కూడా డీఏను సవరించడంతో కొత్త స్థాయికి చేరుకుంది. దీంతో మళ్లీ హెచ్ఆర్ఏ కూడా పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వివిధ మీడియా వర్గాల సమాచారం ప్రకారం, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌసింగ్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఎ) పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్ అలవెన్స్ ని వారు నివసిస్తున్న ప్రదేశాలను బట్టి మూడు x, y, z కేటగిరీలుగా విభజించారు.
నివేదికలు, x కేటగిరీ ప్రదేశాల్లో పని చేసే ఉద్యోగులకు హెచ్ ఆర్ ఏ 27 శాతం ఉంటుంది. అలాగే y గ్రూప్ ఉద్యోగులకు ఇది 18 నుంచి 20 శాతంగా ఉంటుంది. ఇక Z గ్రూప్ ఉద్యోగులకు 9 నుంచి 10 శాతం వరకు ఉంటుందని తెలుపుతున్నాయి.
ఇది కూడా చదవండి..
EPFO అధిక పింఛనుదారులకు గమనిక.. దరఖాస్తులకు రేపే తుది గడువు
మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 3 శాతం వరకు పెరగవచ్చు అని తెలుస్తోంది. x గ్రూప్ ఉద్యోగులకు మూడు శాతం, y గ్రూప్ ఉద్యోగులకు రెండు శాతం, z గ్రూప్ ఉద్యోగులకు ఒక్క శాతం పెరిగే అవకాశముంది. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 27 శాతం నుంచి 30 శాతానికి పెరగనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతూ ఈ ఏడాది మార్చి 24న కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి అమలవుతున్న ఈ పెంపుతో డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా రూ.12,815.60 కోట్లు డియర్‌నెస్ అలవెన్స్ మరియు డియర్‌నెస్ రిలీఫ్ రూపంలో అదనపు భారం పడనుంది. దేశంలో ఈ నిర్ణయంతో దాదాపు 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.
ఇది కూడా చదవండి..
Share your comments