తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ దీపావళి మరియు దసరా పండుగ బోనస్ లను అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన సింగరేణి కార్మికుల ముఖాల్లో సంతోషాన్ని నింపింది. వారికి తెలంగాణ ప్రభుత్వం రూ.1000 కోట్లను బోనస్ గా పంచుతామని తెలిపింది.
ఇటీవలి సింగరేణి ఆదాయం బాగా పెరిగిందని కెసిఆర్ అన్నారు. ఈ ఆదాయం పెంచడంలో సింగరేణి కార్మికులు ఎంతగానో కష్టపడ్డారని ముఖ్యమంత్రి అభినందించారు. దేశంలో అందరూ ఆశ్చర్యపోయేలా రాష్ట్రంలోని ఉద్యోగులకు భారీ స్థాయిలో పే స్కెల్ ఇస్తామని తెలిపారు. సమీప భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీని కూడా అమలు చేస్తామని తెలియజేసారు.
అంతేకాకుండా పారిశ్రామిక సంబంధాల సమస్యపై తక్షణమే దృష్టి సారిస్తానని, సమస్యను పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తూ శాసనసభలో కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న ప్రస్తుత అధికార పార్టీ అధినేత కేసీఆర్, ఈసారి 7-8 సీట్లు ఎక్కువగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..
సామాన్యులకు శుభవార్త చెప్పిన మోడీ ప్రభుత్వం.. త్వరలో తగ్గనున్న ధరలు..
ధరణి విధానం అమలులోకి రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతమై, కేవలం ఐదు నిమిషాల్లోనే తమ రిజిస్ట్రేషన్‌లను పూర్తి చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇక పోడు భూములకు శాశ్వత హక్కు పత్రాలను అందించామని ఇక ఆ భూములకు వారివే అని అన్నారు. ఈ ధరణి వల్ల వేలాది మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు పడుతుందని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రైతు మరణిస్తే, వారికి రూ.5 లక్షల బీమా అందుతుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను కళాశాలలుగా మార్చిందని, ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి 1.25 లక్షల చొప్పున పెట్టుబడి పెడుతున్నారని ఆయన తెలిపారు. తుంగతుర్తి, కోదాడ, డోర్నకల్ నియోజకవర్గాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీరు విజయవంతంగా చేరింది. వర్షాల వల్ల హైదరాబాద్‌కు తీవ్ర నష్టం వాటిల్లితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments