ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఆరు కిలోల రేషన్ బియ్యాన్ని ప్రజలకు పంపిణి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆరు కిలోల బియ్యం పంపిణి అనేది ఈ నెల నుండే అమలు అవుతుందనికూడా అధికారులు తెలియజేసారు.
కరోనా సమయంలో దేశంలో ప్రజలు ఆహార విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పటికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార బాధలను నివారించడానికి ఉచితంగా 10 కిలోల రేషన్ బియ్యాన్ని పంపిణి చేసింది. ఈ 10 కిలోల ఉచిత బియ్యాన్ని రేషన్ దుకాణాల్లో కిందటి సంవత్సరం డిసెంబర్ నెల వరకు ప్రజలకు పంపిణి చేశారు. ఈ రేషన్ బియ్యంతో చాలా పేద ప్రజలకు లబ్ది చేకూరింది. ఈ బియ్యంతో వారి ఆకలి బాధలను తీర్చుకున్నారు.
ఈ ఉచిత బియ్యం పంపిణిని 2023 సంవత్సరం అంతటా పంపిణి చేయమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ వాటాను కేటాయించలేదు. ఈ సంవత్సరం మొదటి నుండి కూడా రాష్ట్రంలో ప్రభుత్వం పేద ప్రజలకు కేవలం ఐదు కిలోల బియ్యాన్ని మాత్రమే పంపిణి చేస్తుంది. కానీ ఈ ఏప్రిల్ నెల నుంచి ఆ ఐదు కిలోల బియ్యానికి రాష్ట్ర వాటాగా మరో కిలో బియ్యాన్ని కలిపి మొత్తం ఆరు కిలోల బియ్యాన్ని పంపిణి చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..
అన్నదాతలకు అండగా 'అగ్రి ల్యాబ్'.. నకిలీ విత్తనాలకు చెక్
ప్రతి నెల అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు బియ్యం, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల చొప్పున రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి కార్డుదారులకు గరిష్టంగా 5 కిలోల గోధుమలను, కిలో 7 రూపాయలు చొప్పున పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చక్కర కిలో రూ. 13.50 చొప్పున ప్రతి అంత్యోదయ కార్డుదారులకు పంపిణీ చేస్తామని, లబ్దిదారులు రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో ప్రతి రేషన్ షాపుకు అదనంగా సరఫరా చేయవలసిన కోటా బియ్యాన్ని ఇప్పటికే అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 15వ తేదీలోగా పంపిణీ పూర్తి అవుతుందని, ఎవరైనా తీసుకోకుంటే గడువు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. రేషన్ దుకాణాల వద్ద రేషనింగ్ ఇన్‌స్పెక్టర్లు, విజిలెన్స్ బృందాలు సక్రమంగా ఆరు కిలోల రేషన్ బియ్యం పంపిణీ జరిగేటట్లు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments