దేశంలో ఎక్కువ శాతం జనాభా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనతకు వయస్సుతో సంబంధం లేదు, పెద్దల నుండి పిల్లల వరకు అందరికి ఈ రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మనకు బలవర్థక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్ ) అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికొరకు కేంద్ర ప్రభుత్వం ఈ బలవర్ధక బియ్యాన్ని దేశంలో ఈ ఎఫ్ ఆర్ కె అందరికి అందించాలి అని నిర్ణయించుకుంది.
వచ్చేనెల ఏప్రిల్ నుండి రేషన్‌కార్డుదారులకు రాష్ట్రంలో ఈ బలవర్ధక (ఫోర్టిఫైడ్) బియ్యాన్ని కోటాలో సరఫరా చేయాలని ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ వచ్చే ఏప్రిల్ నెల నుండి రాష్ట్రంలోని ప్రతి జిల్లలో ఈ బలవర్ధక బియ్యాన్ని సరఫరా చేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్టంలో కొన్ని జిల్లాలో 18 రోజుల నుండి ప్రయోగాత్మకంగా ఈ బియ్యం పంపిణీ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు బలవర్థక బియ్యాన్ని అందించి, వారిలో పోషకాహార లోపాలను నివారించడానికి ప్రయత్నిస్తుంది. ఈ బలవర్థక బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్-ఎ, జింక్ ఇతర బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. వీటిని ముక్కలగా చేసి ప్రతి వంద కిలోల సాధారణ బియ్యంలో ఈ ఈ ముక్కలను ఒక కిలో కలుపుతారు.
ఇది కూడా చదవండి..
ఈ ఒక్క కార్డుతో రైతులకు తక్కువ వడ్డీ రుణాలు..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 15 రాష్ట్రాల్లో ఈ బలవర్ధక బియ్యం పంపిణీని అమలు చేస్తోంది. తెలంగాణాకు చెందిన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఈ బియ్యాన్ని పంపిణి చేస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 2023 నుంచి రేషన్‌కార్డుదారులకు బలవర్ధక బియ్యం సరఫరాకు సిద్ధం కావాలని కేంద్రం సూచించింది.
ప్రభుత్వం సుమారుగా 1.90 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రతి నెల 90 లక్షల మంది రేషన్‌కార్డుదారులకు రాష్ట్రంలో పంపిణి చేస్తుంది. ప్రస్తుత నిర్ణయం ప్రకారం బియ్యంలో పోషకాల మిళితానికి అయ్యే రూ.31.20 కోట్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించనుందని ఉత్తర్వుల్లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లో పిడిస్ ద్వారా ఈ బలవర్ధక బియ్యాన్నే పంపిణి చేయాలనీ నిర్ణయించింది.
ఇది కూడా చదవండి..
Share your comments