వరి సాగులో తెలంగాణ దేశంలోనే కొత్త రికార్డులను సృష్టిస్తుంది , యాసంగిలో ఏకంగా 57 లక్షల ఎకరాలలో పంట సాగు చేస్తూ తెలంగాణ వారి సాగులో కొత్త రికార్డు సృష్టించింది ,గత సంవత్సరం యాసంగిలో దాదాపు 40 లక్షల ఎకరాలలో వారి సాగు అవ్వగా ఇప్పుడు గత సంవత్సరం తో 17 లక్షల ఎకరాలు సాగు చేస్తూ కొత్త రికార్డు సృష్టించింది , అయితే ఇప్పుడు రైతుల ఆలోచన అంత ప్రభుత్వం వడ్లు సేకరిస్తుంది లేదా అని .
ఈ క్రమంలోనే ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది .. ప్రతీ ఏటా కూడా ప్రభుత్వం (ఐకేపీ) కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల దగ్గరి నుండి పంటను కొనుగోలు చేస్తుంది. ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. సీజన్ లో 56.45 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. మొత్తం 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు.
12 వేలకు పెంచనున్న పీఎం కిసాన్.. వార్తల్లో నిజమెంత !
వానాకాలం సీజన్ లో ఏకంగా 50 లక్షల టన్నుల ధాన్యాన్ని సర్కార్ కొనుగోలు చేసింది. ఈ ధాన్యం విలువ దాదాపు రూ.9,600 కోట్లు. అయితే ఈ యాసంగి పంట కూడా మరికొద్ది రోజుల్లోనే రానుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మరో వైపు రైతులకు గన్ని బ్యాగుల కొరత లేకుండా చూసేందుకు ఇప్పటికే ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపింది ప్రభుత్వం .
Share your comments