తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గ వరి పంట కోతలు ప్రారంభమయయ్యి మరియు కొన్ని ప్రాతాలలో వరి కొత్త కోసి ధాన్యం ప్రభుత్వ మార్కెట్ చేరుకున్నాయి ఈ తరుణం లో వరి పంట కొనుగోళ్లు గురించి ఆశగా చూస్తున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది .వానాకాలం ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 22 నుంచి ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. పంట కోతలను బట్టి అవసరమైన చోట కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశాలను జారీచేసింది . 2022-23 సీజన్ దాన్యం కొనుగోళ్లకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీజన్ లో 1.51 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. కోటి టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. గ్రేడ్-ఏ రకానికి క్వింటాల్ కు రూ.2,060, సాధారణ రకానికి రూ. 2,040 గా మద్దతు ధర ఖరారు చేసింది.
Share your comments