News

కౌలు రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో వారికి కూడా రైతు భరోసా.!

Gokavarapu siva
Gokavarapu siva

జగన్ సర్కార్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కౌలు రైతులకు మంచి శుభవార్తను అందించింది. రైతు భరోసా కేంద్రాల (RBKలు) సౌజన్యంతో ఈ సంవత్సరం 7.77 లక్షల మంది రైతులకు కౌలు కార్డులను అందజేసారు. ఈ రైతుల వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్‌లోడ్ కూడా అప్లోడ్ చేసినట్లు తెలిపారు. ఈ కౌలు రైతులకు కూడా వచ్చే సెప్టెంబర్‌ నెలలో రైతు భరోసా తొలి విడత సాయం అందించనున్నట్లు తెలిపారు.

దానితోపాటుగా ఈ సంవత్సరం కౌలు రైతులకు భారీగా రూ.4వేల కోట్ల పంట రుణాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత నాలుగు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరంలో ఎక్కువగా కౌలు కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. అర్హులైన ప్రతి కౌలు రైతుకూ పంట రుణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నిర్వహించిన ప్రత్యేక మేళాల్లో రికార్డు స్థాయిలో కౌలుదారులకు సీసీఆర్సీలు జారీ చేసింది. ఈ కౌలు కార్డులకు 11 నెలల కాల పరిమితి ఉంటుంది.

ఇది కూడా చదవండి..

రేషన్ షాపుల్లో బియ్యం తోపాటు ఉచితంగా కిలో చక్కర ఎక్కడంటే

గత నాలుగేళ్లుగా ప్రభుత్వం సీసీఆర్‌సీ కార్యక్రమం ద్వారా పంట రుణాలు, పలు రకాల సంక్షేమ ఫలాలను అందజేస్తూ కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. 2019-20లో, మొత్తం 272,720 మంది రైతులకు CCRC కార్డ్‌లు జారీ చేసింది, 2020-21లో 414,770 మంది వ్యక్తులు మరియు 2021-22లో 524,203 మంది రైతులకు CCRC కార్డ్‌లు జారీ చేసింది.

మరొకవైపు రైతులు పండించిన పంటలను వారు అమ్ముకుందుకు ప్రభుత్వం వారికి ఈ క్రాప్ బుకింగ్ చేస్తుంది. రైతులు పండించిన ప్రతీ పంట ఈ క్రాప్‌ బుకింగ్‌ చేసేందుకు వ్యవసాయశాఖ పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ఈ క్రాప్ బుకింగ్ కి రైతులు తమ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చు. వ్యవసాయశాఖకు సంబంధించిన ఏ పథకం అమలు చేయాలన్నా ఈ క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి..

రేషన్ షాపుల్లో బియ్యం తోపాటు ఉచితంగా కిలో చక్కర ఎక్కడంటే

Share your comments

Subscribe Magazine

More on News

More