దేశంలోని ప్రజలకు ఇది శుభవార్త అనే చెప్పాలి. త్వరలో పాల ధరలు తగ్గనున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడిచిన మూడేళ్ళుగా దేశంలో ఎప్పులేని విధంగా పాల ధరలు ఏకంగా 22 శాతం పెరిగాయి. కేవలం గత సంవవత్సరంలోనే 10 శాతం వృద్ధి నమోదయ్యింది. ప్రస్తుతం పచ్చి మేత ధర తగ్గిందని, వర్షాకాలం ముగియగానే పాల ధరలు తగ్గే వీలుందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా తెలిపారు.
వాతావరణ పరిస్థితులు పంటలను దెబ్బతీస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పర్షోత్తం రూపాలా అన్నారు. దేశంలో దాణా కొరత కూడా లేదని ఆయన తెలిపారు. రాష్ట్రాలు తగినంత స్టాక్‌ను కలిగి ఉన్నాయని చెప్పారు. పాల ఉత్పత్తిని పెంపొందించడమే అంతిమ లక్ష్యంతో, వాతావరణ నిరోధక పశువుల జాతులను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చురుకుగా నిమగ్నమై ఉందని రూపాలా వెల్లడించారు.
ప్రజలు కూడా ఈ పెరుగుతున్న పాల ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పర్షోత్తం రూపాలా మాట్లాడుతూ దేశంలోని ఈ పాల ధరలను పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ నియంత్రణలో లేదని తెలియజేసారు. ఈ పాల ధరలను సహకార మరియు ప్రైవేట్ డెయిరీలు వాటి ఉత్పత్తి వ్యయం, మార్కెట్ శక్తుల ఆధారంగా నిర్ణయిస్తాయని అన్నారు.
ఇది కూడా చదవండి..
రూ. 2000 నోట్లు 88 శాతం రికవరీ ..
అదనంగా ఆయన మాట్లాడుతూ పాలు త్వరగా పాడయిపోయే వస్తువు అని, వాటిని ఎక్కువ కాలం నిల్వ చేయడం కష్టమని అన్నారు. ఇలాంటి వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు రావడం సాధారణమని అన్నారు. అయితే, ఇటీవలి కార్పొరేషన్ల విలీనం మార్కెట్‌లో ధరలను స్థిరీకరించడానికి దారితీసింది. వినియోగదారులు చెల్లించే మొత్తంలో 75 శాతం నేరుగా ఉత్పత్తిదారులకే లబ్ధి చేకూరేలా అమూల్ మోడల్ పాత్రను కూడా మంత్రి ప్రస్తావించారు. ఇప్పుడు రైతులకు వారి ఉత్పత్తి ఖర్చులను కవర్ చేయడానికి ఎలా సహాయం చేయాలో పరిశీలిస్తున్నామని మంత్రి పర్షోత్తం రూపాలా తెలిపారు.
ఇది కూడా చదవండి..
Share your comments