ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు మరొక శుభవార్తను అందించింది. ఈ నెల 19వ తేదీ అనగా ఈరోజు వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'జగనన్న చేదోడు' పథకం లబ్ధిదారులకు నాల్గో విడత ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నారు.
ఈ నెల 19వ తేదీన అనగా ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిపాడ్ ఏర్పాటు కోసం పట్టణంలోని ఓ మైదానాన్ని పరిశీలించారు. పట్టణంలోని వైడబ్ల్యూసీఎస్ మైదానంలో సీఎం సభ జరిగే స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బారికేడ్ల ఏర్పాటు, వీఐపీ గ్యాలరీ, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు జేసీ సూచనలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న చేదోడు’కు 3,25,020 ( 3 లక్షల 25 వేల 20) మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ లబ్దిదారులుగా ఉన్నారు. మొత్తంగా రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో అక్టోబర్ 19న సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జను చేయనున్నారు.
ఇది కూడా చదవండి..
కౌలు రైతులకు శుభవార్తను అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..!
ఈ సహాయం నుండి ప్రయోజనం పొందే వ్యక్తులలో రజకులు, నాయీ బ్రాహ్మణులు మరియు వారి స్వంత దుకాణాలను కలిగి ఉన్న టైలర్లు ఉన్నారు. వీరికి ప్రతి సంవత్సరం ప్రభుత్వం రూ.10,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. తాజాగా అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కొక్కరికి రూ.40,000 వరకు జగన్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించినట్లయింది. ఈ 4 ఏళ్ళలో కేవలం ఈ పథకం ద్వారా వైసీపీ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లకు చేరింది.
ఈ పథకం లబ్ధిదారులు ఆదాయ వనరులను పెంచుకోవడాని, పరికరాలు, అవసమైన వాటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఈ సాయం చేస్తోంది. జగనన్న చేదోడు పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు సచివాలయానికి వెళ్లి సంప్రదించాల్సి ఉంటుంది. సచివాలయంలో చేదోడు అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు జిరాక్స్, రైస్ కార్డు జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, దరఖాస్తుదారు బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి..
Share your comments