తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పొందుతున్న వారికి ఈవార్త ఉత్తేజపరుస్తది అని చెప్పవచ్చు. త్వరలోనే వీరికి ఆసరా పెన్షన్లు పెరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అసరా పెన్షన్లను పెంచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప భవిష్యత్తులో పింఛన్లకు సంబంధించి ఉన్నతమైన వార్తలను అందించడానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవల జరిగిన సభలో మంత్రి కేటీఆర్ ఓరుగల్లులో సూచించారు. మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది; అయితే, ఈలోగా పింఛన్ల పెంపుదలకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే దివ్యాంగుల పెన్షన్లను రూ. 4016 కు పెంచగా, మిగతా ఆసరా పెన్షన్లను కూడా రూ. 1000 పెంచనున్నట్లు సమాచారం. కేసీఆర్ అంటే సంక్షేమం, విపక్షాలది సంక్షోభం అని కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. 60 ఏళ్ల పాటు అధికారంలో ఉండి, అభివృద్ధిని తీసుకురాలేకపోయిన వారు ఈ సమయంలో అకస్మాత్తుగా అభివృద్ధి చేస్తారా అని మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు.
ఒక్కఛాన్స్ ఇవ్వండని మీ దగ్గరకు వస్తారు, ఇలాంటి వారిని నమ్మి వారికి ఓట్లు వేసి మోసపోవద్దని మంత్రి కేటిఆర్ సూచించారు. పొలిటికల్ టూరిస్టులు చెప్పే మాటలను ఎవరూ నమ్మొద్దన్నారు. మోసాన్ని మోసంతోనే జయించాలన్నారు.
ఇది కూడా చదవండి..
కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ.. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సంచలన పథకాలు..! అవేమిటంటే?
బిఆర్ఎస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తమ అభ్యర్థులను అందరి కంటే నాలుగు నెలల ముందుగానే ప్రకటించింది. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా బిఆర్‌ఎస్ ఇప్పుడు తన సమగ్ర మేనిఫెస్టోను పోటీదారుల కంటే ముందు ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మేనిఫెస్టోను ఈ నెల 16వ తేదీన వరంగల్ నగరంలో నిర్వహించే కార్యక్రమంలో అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments