భారతీయ మార్కెట్‌లో, విజయదశమి తర్వాత బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి, అయితే ఇటీవలి రోజుల్లో, ఈ ధరలలో తగ్గుదల కనిపించింది. నేడు ప్రత్యేకంగా 10 గ్రాముల బంగారం ధరలు రూ. 440 వరకు తగ్గడం జరిగింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? వాటి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అనే సమాచారం ఇక్కడ చూద్దాం.
ప్రస్తుతం విజయవాడలో ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5570 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6076గా ఉంది. ఈ సమాచారం ఆధారంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55700, మరియు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60760 వద్ద నడుస్తుంది. నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, గుంటూరు మరియు ప్రొద్దుటూరు వంటి ఇతర నగరాల్లో కూడా ఇదే ధరలను గమనించవచ్చు.
చెన్నైలో ప్రస్తుతం గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ. 5615 మరియు 24 క్యారెట్లకు రూ. 6125గా కొనసాగుతుంది. అంటే 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.56150 మరియు 24 క్యారెట్లకు రూ. 61250 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు 22 క్యారెట్లపై రూ. 450 మరియు 24 క్యారెట్లపై రూ. 550 తగ్గింది.
ఇది కూడా చదవండి..
గుడ్ న్యూస్.. 'ఆరోగ్య శ్రీ'పై ప్రత్యేక దృష్టి.. డిసెంబర్ 1 నుండి కొత్త కార్డులు
ప్రస్తుతం మన దేశ రాజధానిలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ ఈరోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5585, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6091గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400 (22 క్యారెట్స్), రూ. 440 (24 క్యారెట్స్) తగ్గి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55850, రూ. 60910కి చేరింది. వెండి ధరలు తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో కేజీ మీద ఏకంగా రూ. 300 తగ్గింది.
ఇది కూడా చదవండి..
Share your comments