రాజస్థాన్ రాష్ట్రము లో గ్యాస్ సిలిండెర్ ధర ను రూ.500 కు తగ్గిస్తున్నట్లు ఆర్డర్ ను జారీచేశారు ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి దీనితో గ్యాస్ సిలిండర్ రూ . 500 లకు ప్యాడ్లకు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం .
కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల కార్యక్రమానికి హాజరయ్యారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలోనే బీజేపీపై విరుచుకుపడిన అశోక్ గెహ్లట్ కూడా కీలక ప్రకటన చేశారు . అంటే దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఏటా అందించే 12 సిలిండర్ల ధరను ఏడాది పొడవునా సగానికి తగ్గించనున్నట్లు ఆయన ప్రకటించారు.
వచ్చే సంవత్సరం నుంచి దీనికోసం ప్రత్యేకముగా బడ్జెట్ కేటాయించనున్నారు , ప్రధాని కేవలం ఉజ్వల్ యోజన పేరుతో రూ . 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ . 1100 వందలకు పెంచారని , కానీ తమ ప్రభుత్వం నీరు పేదలకు రూ . 500 లేక్ గ్యాస్ సిలిండెర్ అందించాలి నిరన్యం తీసుకున్నాడని ఆయన తెలిపారు .పేదలకు, ఉజ్వల పథకం కింద ఉన్న వారికి ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లు అందజేస్తామని తెలిపారు .
వచ్చే ఏడాది రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే అధికారాన్ని చేజిక్కించుకోవడం కంటే, పార్టీని, దానిలోని అంతర్గత పోరును అధిగమించడమే కాంగ్రెస్ నాయకత్వానికి పెద్ద సమస్య.
ఈ నెల ప్రారంభంలో రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఆయన రాజస్థాన్ రాకముందు ముఖ్యమంత్రి అశోక్ ఖేలత్ పక్షం, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Share your comments