News

మహిళలకు శుభవార్త: ఈ నెల 12న వారి ఖాతాల్లోకి రూ.15 వేలు..

Gokavarapu siva
Gokavarapu siva

ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని చదువుకునే విద్యార్థులకు అమ్మఒడి మరియు విద్యదివేన వంటి పథకాలు అమలులో ఉన్నాయి. రైతుల కోసం ఐతే రైతులను ఆర్ధికంగా ఆదుకోవడానికి రైతు భరోసా పథకం ద్వారా సహాయం అందిస్తుంది ప్రభుత్వం. అలాగే రాష్ట్రంలో మహిళలకు అండగా నిలవాలనే ఆలోచనతో ఈ జనవరి రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

మహిళల కొరకు అందుబాటులోకి తీసుకువచ్చిన పథకం పేరు వైఎస్ఆ ర్ఈబీసీ నేస్తం. రాష్ట్రంలో పేద మరియు మధ్య తరగతి మహిళలను ఆర్ధికంగా ఆదుకోవడానికి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంతో రాష్ట్రంలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పేద మహిళలకు రూ. 45 వేల ఆర్థిక సహకారాన్ని అందజేస్తారు. ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఆర్ధికంగా వెనకబడి ఉన్న వివిధ వర్గాలైన ఆర్య, వైశ్య, బ్రాహ్మణ, వెలమ, ఓసీ, రెడ్లు, కమ్మ, క్షత్రియ, మహిళలలు ఈ పథకానికి అర్హులు.

ఈ పథకాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏపీ సీఎం జగన్ ఈ నెల 12వ తేదీన ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి మహిళల ఖాతాల్లోకి బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని చాలా మంది మహిళలకు లబ్ది చేకూరుతుంది. వారికి ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని మహిళలు ఈ పథకంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్: పేదలకు రేషన్ బియ్యం కోటా పెంపు

మహిళలు ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే వారికి గ్రామాల్లో వార్షిక కుటుంబ ఆదాయం అనేది నెలకు రూ.10 వేలు మరియు పట్టణాల్లో ఐతే నెలకు రూ.12 వేలు మించకూడదు. ఆ మహిళలకు మాత్రమే ఈ పథకం కింద డబ్బులు అందుతాయి. ఈ మహిళలకు మూడు ఎకరాలు కన్నా తక్కువ మాగాణి భూమి ఉండాలి, మరియు మాగాణి, మెత్త భూమి కలిపితే గనుక 10 ఎకరాల లోపు ఉండాలి.

ఏబీసీ నేస్తం పథకం కింద పొందాలంటే ఆ మహిళా కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ఆ కుటుంబంలో పెన్షన్ కిసుకునే వారు కూడా ఉండకూడదు. మున్సిపాలిటీలో 750 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉండకూడదన్న నిబంధన ఉంది. వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తంలో ఉన్న వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు ఈ పథకానికి అర్హులు కారు. ఈ నిబంధనలు పారిశుద్ధ్య కార్మికులకు వర్తించవు. ఆదాయ పన్ను కట్టేవారికి కూడా ఈ పథకం వర్తించదు.

ఈ పథకానికి కావలసిన ధ్రువపత్రాలు ఏమిటంటే అర్హులైన మహిళ పేరు మీద ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, వయసు ధ్రువీకరణ పత్రాలు, ఈబీసీ సర్టిఫికెట్, రైస్ కార్డు, దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అందజేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి 4 లక్షల 60 వేల 20 మంది మహిళలు అర్హులుగా గుర్తించింది.

ఇది కూడా చదవండి..

రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్: పేదలకు రేషన్ బియ్యం కోటా పెంపు

Share your comments

Subscribe Magazine

More on News

More