పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనే వార్త కొంత ఊరటను ఇచ్చే అంశం, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న క్రమంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. చమురు కంపెనీలు కారణంగా చమురు ధరలను విపీరతంగా పెంచేసాయి రికవరీ పేరుతో పెట్రోల్ ,డీజిల్ పై అధిక చార్జీలను పెంచేసాయి . అయితే ఈ త్రైమాసికంలో చమురు కంపనీలు లాభాల బాట పట్టడంతో రికవరీ చార్జీలను ఎత్తేసే అవకాశము ఉన్నది దీనితో చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి .
మరి కొన్ని రాష్ట్రాలు పెట్రోల్ సెస్సును కూడా తగ్గించాయి దీనితో ఆయా రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు 10 నుంచి 12 రూపాయవరకు తగ్గవచ్చు , మిగిలిన రాష్ట్రాలలో ఒకవేళ చమురు కంపనీలు రికవరీ చార్జీలను ఉపసంహరించుకున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు 7-9 రూపాయల వరకు ఆయా రాష్ట్రాలను బట్టి తగ్గే అవకాశం వున్నది .
తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు.. జూన్ 1వ తేదీ నుండి కొత్త రేట్లు అమలు
మరోవైపు చమురు దిగుమతుల కొరత పై వస్తున్న వార్తలపై స్పందించిన ప్రభుత్వ వర్గాలు ప్రపంచంలోని ప్రముఖ చమురు ఎగుమతిదారు సౌదీ అరేబియా కూడా జూలై నుండి తదుపరి ఉత్పత్తి కోతలను అమలు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. అయితే, చమురు ఉత్పత్తిదారుల ఈ నిర్ణయాల వల్ల ముడి చమురు సరఫరాలో కొరత ఏర్పడే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలలో కూడా పెట్రోల్ మరియు డీజిల్ ధరల పై సెస్సును తగ్గిస్తే ధరలు 10 నుంచి 12 రూపాయ వరకు తగ్గే అవకాశం వున్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు .
Share your comments