తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలంగాణ గ్రామీణాభివృది శాఖ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్ రావు హన్మ కొండలో జరిగిన ఆత్మీయ సంమ్మేళనం లో వెల్లడించారు .
ఆత్మీయ సమ్మలనం లో భాగంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే కొత్త పెన్షన్ లబ్దిదారులకు పెన్షన్లు ఇస్తామని ఇప్పటికి ఆగిపోయిన వారికికూడా త్వరలో పెన్షన్ మంజూరు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ముందుచూపు వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో డెవలప్ అయ్యింది. అభివృద్ది కార్యక్రమాలు చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్ లకే దక్కుతుంది.ఆడపిల్ల పెళ్లికి మేనమామగా రూ.లక్ష ఇచ్చిన ఘనత కేసీఆర్ దే. మేనమామగా కేసీఆర్ ను ఆదరించాలి. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం రూ.500 పెన్షన్ ఇస్తోంది. కరోనా కారణంగా ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు. తెలంగాణలో మాత్రం పెన్షన్ గా రూ.2వేలు కేసీఆర్ ఇస్తున్నారు అని విమర్శించారు .
ఇది కూడా చదవండి .
కేంద్రం లో ఉన్న ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేసి ప్రజలను మోసం చేశారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుపించారు మంత్రి ఎర్రబెల్లి. తెలంగాణకు గిరిజన విశ్వ విద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రానికి ఏది చేయకుండా ఓటు అడిగే హక్కు కేంద్ర ప్రభుత్వానికి కి లేదు అన్నారు మంత్రి .
ఇది కూడా చదవండి .
Share your comments