ఖమ్మంలోని పోలేపల్లిలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్నేరు నది వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు వరద సహాయం ప్రకటించారు.
మున్నేరు నది వరదల వల్ల అనేక కుటుంబాలు అతలాకుతలం అయ్యాయని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడతామని, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ₹650 కోట్లు కేటాయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు."
బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేస్తామని, వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా ₹10వేలు అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
"వరద బాధితులను నేరుగా కలిసి…ప్రభుత్వం తమకు అండగా ఉందన్న భరోసా కల్పించే ప్రయత్నం చేశాను.
ఖమ్మం ఎఫ్ సిఐ రోడ్డు లో మున్నేరు వరద ప్రభావిత కాలనీలో బాధితులతో ముఖాముఖి మాట్లాడాను.
తక్షణ సాయంగా కుటుంబానికి రూ.10 వేలు అందజేయాలని నిర్ణయించాం. " రేవంత్ రెడ్డి.
వరదల్లో వస్తువులు కోల్పోయిన కుటుంబాలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన, ఖమ్మంలోని వరద బాధిత కుటుంబాలలో హర్షం వ్యక్తమవుతోంది.
Share your comments