రూ. 2000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి తొలగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే. దేశంలో మార్కెట్ నుండి ఈ రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే నెల 19వ తేదీన అధికారికంగా ప్రకటించింది. ప్రజలు ఈ నోట్లను మార్చుకోవడానికి లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు RBI గడువు ఇచ్చింది.
అయితే గతంలో రూ.2000 నోట్ల ఉపసంహరణకు ఆర్బిఐ ప్రకటించించిన గడువు నిన్నటితో ముగిసింది.అయితే గడువును పొడిగిస్తారా లేదా అనే దానిపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000 నోట్ల ఉపసంహరణ గడువు పొడుగింపుపై ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది, అది వినియోగదారులకు సానుకూల వార్తలను అందిస్తుంది.
రూ.2000 నోట్లను మార్చుకునేందుకు గడువును పొడిగించాలని ఆర్బిఐ నిర్ణయించింది. రిజర్వ్ బ్యాంక్ రూ.2 వేల నోట్ల మార్పిడి గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది, ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవచ్చు. మే 19, 2023న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వినియోగదారులకు రూ. 2000 నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకోవడానికి నాలుగు నెలల గడువు విధించింది, అది నిన్నటితో ముగిసింది.
ఇది కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాలకు 3 రోజులపాటు వర్ష సూచనలు..! ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండి
అయితే తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ పెద్ద నోట్ల ఉపసంహరణను సులభతరం చేయడానికి, అవసరమైన చర్యలు తీసుకోవాలని RBI అన్ని బ్యాంకులను ఆదేశించింది. రూ.2000 నోట్లను కలిగి ఉన్నవారు వాటిని తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు లేదా ఇతర డినామినేషన్లకు మార్చుకునే అవకాశం కల్పించారు. అయితే సెప్టెంబర్ 30తో గడువు ముగియనున్న నేపథ్యంలో గడువు పొడిగిస్తుందా..? లేదా అనే సందేహం చాలా మందిలో కలిగింది. అయితే ముందుగా ఆర్బీఐ ఈ నోట్ల మార్పిడికి గడువు పొడిగించేది లేదని భావించినా.. ఇతరుల నుంచి విజ్ఞప్తుల మేరకు తేదీని పొడిగిస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
వివిధ బ్యాంకుల నుండి పొందిన డేటా ప్రకారం, సెప్టెంబర్ 1 నాటికి, 3.32 లక్షల కోట్ల రూపాయల విలువైన 2000 రూపాయల నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి తిరిగి వచ్చాయి. దేశంలో చలామణిలోకి పంపబడిన మొత్తం 2,000 రూపాయల నోట్లలో 93 శాతం విజయవంతంగా తిరిగి వచ్చినట్లు RBI ఇటీవల వెల్లడించింది.
ఇది కూడా చదవండి..
Share your comments