News

గుడ్ న్యూస్.. గ్యాస్ సీలిండర్లపై సబ్సిడీని పెంచిన కేంద్ర ప్రభుత్వం..! ఎంతంటే?

Gokavarapu siva
Gokavarapu siva

దేశంలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్తను అందించింది. దేశంలోని లక్షలాది కుటుంబాలకు ఉపశమనంగా, కేంద్ర మంత్రివర్గం బుధవారం, అక్టోబర్ 4, ఉజ్వల లబ్ధిదారులకు ఎల్‌పిజి సబ్సిడీని సిలిండర్‌కు ప్రస్తుతం ఉన్న రూ.200 నుండి రూ.300కి పెంచింది. కేబినెట్ నిర్ణయాల బ్రీఫింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని ప్రకటించారు.

ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు ఉపశమనం ఇస్తూ, ప్రభుత్వం మరోసారి దాని ధరలలో ఉపశమనం ఇవ్వాలని నిర్ణయించింది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పుడు రూ.200కి బదులుగా రూ.300 సబ్సిడీ ఇస్తుంది. ప్రభుత్వ ఈ ధరల వల్ల ఒక్కో సిలిండర్ ధర రూ.600 అవుతుంది. కానీ కేబినెట్ సమావేశం తర్వాత ఇప్పుడు సబ్సిడీని రూ.100 పెంచారు. సబ్సిడీ పెంపు తర్వాత మార్కెట్‌లో ఎల్‌పీజీ గ్యాస్‌ ధర రూ.700 నుంచి రూ.600కి తగ్గింది.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద మహిళా లబ్ధిదారుల కోసం 75 లక్షల అదనపు ఎల్‌పిజి కనెక్షన్‌లను చేర్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో వారపు సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. అదనపు ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడం వల్ల రానున్న మూడేళ్లలో కేంద్రంపై రూ.1650 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి..

రాజధాని ఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు.. భయటకు పరుగులు తీసిన ప్రజలు..!

మరొకవైపు, అక్టోబర్ నెల ప్రారంభం కాగా, ఎల్పీజీ కంపెనీ గ్యాస్ సిలిండర్ల కొత్త రేట్లు కూడా విడుదల చేసింది. నిన్నటి నుండి అంటే అక్టోబర్ మొదటి తేదీ నుండి ఎల్‌పిజి సిలిండర్ ధరలో పెరుగుదల ఉంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయని చెబుతున్నారు. ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.209 పెరిగింది. గ్యాస్ సిలిండర్ ధరలో ఈ పెరుగుదల 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్‌లో జరిగింది.

ఇది కూడా చదవండి..

రాజధాని ఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు.. భయటకు పరుగులు తీసిన ప్రజలు..!

Share your comments

Subscribe Magazine

More on News

More