తెలంగాణలోని గొల్ల కురుమలకు తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రెండో విడత గొర్రెల పంపిణీ జూన్ నెల 5వ తేదీ నుండి చేయనున్నట్లు తెలిపారు. ఈ వార్త కమ్యూనిటీకి ఉపశమనం కలిగించింది మరియు వారి జీవనోపాధిపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
నల్గొండ జిల్లాలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి రెండో విడుత కార్యక్రమంపై ఉన్నతాధికారులతో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గొర్రెల పంపిణీ చేయాలనే ఆలోచనను సూచించి ఆమోదించారు.
ఈ పథకం మొదటి విడత జూన్ 20, 2017 లో ప్రారంభమై, సుమారు 3,665,000 గొర్రెలను పంపిణి చేయడం జరిగింది .ఈ పథకానికి రిజిస్టర్ చేసుకోడానికి లబ్ధిదారుడు తెలంగాణ స్థానికుడు అయ్యుండాలి . కుర్మా లేదా యాదవ వర్గానికి చెంది ఉండి , 18 సంవత్సరాలకు పైబడి ఉండాలి.
ఇది కూడా చదవండి..
జులై లో రైతుబంధు .. కొత్త దరఖాస్తు వల్ల ఆలస్యం ..!
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.
ప్రభుత్వం గొర్రెల యొక్క యూనిట్ వ్యయాన్ని రూ. 1. 25 లక్షల నుంచి 1. 75 లక్షలకు పెంచిందని, వీటిలో 25 శాతం ( రూ . 43,750) లబ్దిదారుడి వాటా, మిగతాది ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందన్నారు. ఇందులో లబ్ధిదారూడి వాటా సేకరణ కోసం మండల స్థాయిలో గొల్ల ,కుర్మ సంఘాల ఆద్వర్యంలో మీటింగులు పెట్టి అవగాహన కల్పించాలని సూచించారు . నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ఆధ్వర్యం లో సమావేశాలు నిర్వహించి గొల్ల, కుర్మ వర్గాల వారికి అవగాహనా కల్పించాలి అన్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments