రాబోయే ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు సంతోషకరమైన వార్తలను అందించింది. ఈ సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో చేనేత వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఉత్సవాల్లో భాగంగా, ఆగస్టు 7 నుండి 14 వరకు పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రత్యేక ప్రదర్శన జరగనుంది.
మంత్రి కేటీఆర్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మగ్గాల ఆధునీకరణ, నవీకరణ, నేత కార్మికులకు హెల్త్‌కార్డుల జారీ, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ఏటా రూ.95 కోట్ల రుణం, చేనేత మ్యూజియం ఏర్పాటు, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం వంటివి ఉన్నాయి.
ప్రభుత్వం అందిచనున్న ఈ హెల్త్‌కార్డుల ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి చేనేత ఫ్యామిలీకి రూ.25వేల వరకు వైద్యసేవలు పొందవచ్చు. ఈ వైద్యసదుపాయాల్లో చేనేత కార్మికులకు డయాబెటీస్, ఎముకలు, కంటి, బ్లడ్‌ప్లెషర్ వంటి వాటికి ఉచితంగా చికిత్స అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూత పథకం ద్వారా 8 శాతం వేతనాలను జమ చేస్తుంది. మరొకవైపు వారి పేరున 16 శాతాన్ని ఆదా చేస్తుంది.
చేనేత పరిశ్రమను మెరుగుపరిచేందుకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుంటల మగ్గాల స్థానంలో కొత్త ఫ్రేమ్ లూమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కో ఫ్రేమ్ మగ్గానికి అయ్యే ఖర్చు రూ. 38 వేలు అయితే ప్రభుత్వం మొత్తం రూ.40.50 కోట్లను ఈ పథకం కోసం ఖర్చుచేయనుంది. చేనేత సంఘాలకు రుణభారం పడకుండా పావలా వడ్డీ కింద రుణాలు ఇవ్వనున్నారు.
ఇది కూడా చదవండి..
తెలంగాణ :ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత..
కష్టపడి పనిచేసే ఈ చేనేత కార్మికులకు అందించే మరణ పరిహారం రూ. 12,500 నుండి రూ. 25,000 ప్రభుత్వం పెంచింది. చేనేత సంఘాల వ్యాపార కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (DCCB) నగదు క్రెడిట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
'చేనేత మిత్ర' పథకం ద్వారా నూలు, రంగులు మరియు రసాయనాలపై 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తుంది. జియో ట్యాగ్‌లతో చేనేత మగ్గాలు నిర్వహించే కార్మికులను ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నెలకు రూ.3000 జమ చేస్తారు. గత ఆగస్టు నుండి 59 ఏళ్లలోపు ఉన్న వారికి నేతన్న బీమా పథకం అమలవుతుంది. ఇకపై 60 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వయసు గల వారికి వర్తింపజేయనున్నారు.
ఈ నెల జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ దేశంలోనే తొలిసారిగా చేనేత మ్యూజియం ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ఉప్పల్ భగాయత్‌లో 2,375 గజాల స్థలాన్ని కూడా కేటాయించారు.
ఇది కూడా చదవండి..
Share your comments