News

తెలంగాణ రైతులకు శుభవార్త: నేటి నుంచి ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు!

KJ Staff
KJ Staff

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి వ్యవసాయంలో అండగా నిలవాలని రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తు వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.దానికి తోడు ఎంతో 2018 సార్వత్రిక ఎన్నికల సమయంలో రైతు రుణాల మాఫీ చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే 25 వేల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయడం జరిగింది.

తాజాగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్ ర్ ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం స్వల్ప కాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించి రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా రాష్ట్రం అవతరించిందన్నారు.

2014 వరకు రాష్ట్రంలో 49లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత దాదాపు కోటి ఎకరాలకు నీరు అందించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే పంట రుణాలు తీసుకున్న రైతులకు శుభవార్తను చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పంట రుణమాఫీ పథకంలో భాగంగా ఇప్పటికే 25 వేల లోపు పంట రుణాలు ఉన్న మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే 50 వేల లోపు పంట రుణాలు ఉన్న రైతులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ పెద్ద శుభవార్త చెప్పాడు.

రాష్ట్ర వ్యాప్తంగా 50వేల లోపు రుణాలు తీసుకున్న దాదాపు 6 లక్షల మంది రైతులకు
2,006 కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో మొదటి దశ రెండవ దశలో కలిపి దాదాపు 9లక్షల మంది రైతులు రుణమాఫీ లబ్ధి పొందుతున్నారు. ఆగస్టు చివరి నాటికి పంటల రుణమాఫీ పథకం ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Share your comments

Subscribe Magazine

More on News

More