అతి త్వరలో రైతు బంధు పంట సాయాన్ని విడుదల చేసే కార్య కలాపాల్లో ప్రభుత్వం నిమగ్నమైయున్న ప్రభుత్వం,కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు రైతుబంధు పోర్టల్లో నమోదైన వివరాలను/ తప్పిదాలను నవీకరణ చేసేందుకు అవకాశం కల్పించింది.
గతేడాది డిసెంబరు చివరి నాటికి కొత్తగా డిజిటల్ పాసుపుస్తకాలు పొందిన రైతులు తమ వివరాలను పోర్టల్ లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.
ఏఈవోలకు ప్రత్యేకంగా లాగిన్ ఇచ్చి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇదిలా ఉండగా జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతుల పరిస్థితి అయోమయం గ ఉంది .వారు పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఇంకా అవకాశం కల్పించలేదు . ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది వేల మంది వరకు రైతులు ఉంటారని రెవెన్యూ గణాంకాలలో వెల్లడయ్యింది .రైతు బంధు సాయం అందించే గడువు దగ్గరపడుతున్నా కానీ, కొత్తగా పాసుబుక్ లు పొందిన రైతులకు పోర్టల్లో నమోదుపై ఇంకా స్పష్టత ఇవ్వడంలేదు ప్రభుత్వం.
పోర్టల్ లో బ్యాంకు ఖాతా వివరాల సవరణ :
రైతుబంధు పోర్టల్లో పంట రుణ ఖాతా కాకుండా వేరే బ్యాంకు ఖాతాను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీనికి రైతులు ఏఈవోకు దరఖాస్తు చేసుకుంటే వ్యవసాయ శాఖ అధికారులు వివరాలను పరిశీలించి సవరణను ఆమోదిస్తారు .మీ ఫోన్ నంబరును అలాగే కొత్త బ్యాంకు ఖాతా ఉన్నట్లయితే దానిని కూడా పోర్టల్ లో నమోదు చేస్కునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి
BC బంధు పథకం:1 లక్ష ఆర్థిక సాయం .. 3 రోజులలో ముగియనున్న గడువు .. ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
రైతులకి పెట్టుబడి సాయం అందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుబంధు పోర్టల్ను రూపొందించింది. ప్రారంభంలో సీసీఎల్ఎ(రెవెన్యూ-భూ పరిపాలనశాఖ) అధికారులు ఇచ్చిన సమాచారాన్ని నేరుగా పోర్టల్లో నిక్షిప్తం చేసి ఆయా సమాచారం మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. నాలు గేళ్ల నుంచి కొత్తగా డిజిటల్ పాసుపుస్తకాలు వచ్చాక వివరాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు ట్యాబ్లలో నమోదు చేస్తున్నారు. ఏఈవోలకు ప్రత్యేకంగా లాగిన్ ఇచ్చి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని నిర్దేశించారు.
రైతులు తమ ఖాతా వివరాలను ఏఈవోలకు అందించాలి అని, వ్యవసాయాధికారి, వీరాస్వామి తెలిపారు.
గత సంవత్సరం డిసెంబరు 22 నాటికి డిజిటల్ పాసుపుస్తకాలు వచ్చిన రైతులు తమ వివరాలు ఏఈవోలకు అందిస్తే వారే రైతుబంధు పోర్టల్లో నమోదు చేస్తారు. ఇదివరకు పెట్టుబడి సాయం పొందుతున్న వారు ప్రస్తుతం మళ్లీ వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఖాతా నంబర్లను మార్పిడి చేసుకునే వీలుంది. పోర్టల్లో నమోదైన వివరాల్లో ఏమైనా తప్పిదాలుంటే సవరించుకునే వీలుంది.
ఇది కూడా చదవండి
Share your comments