News

ఖరీఫ్ 2024-25 కనీస మద్దత్తు ధర పెంపు.... ఆమోదం తెలిపిన కేంద్రం....

KJ Staff
KJ Staff

ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా, 2024-25 మార్కెటింగ్ సీజన్లోని అన్ని ఖరీఫ్ పంటల మద్దతు ధరల పెంపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2024 లోకసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎండిఏ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలతో నిన్న సమావేశం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో భేటీ అయినా మంత్రులు, ప్రధాన ఖరీఫ్ పంటల, కనీస మద్దతు ధర(ఎంఎస్పి) పెంపునకు ఆమోదం తెలిపారు. సాగుదారులు తాము పండించిన ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను పొందేలా చెయ్యడం, ఈ ఎంఎస్ప్ యొక్క ముఖ్య ఉదేశ్యం. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ధరల్లో భారీగా పెరుగుదల కనిపిస్తుంది. రైతులు పంటలు సాగు చెయ్యడానికి అయ్యే ఖర్చు, దేశ ఆర్ధిక పరిస్థితులు మరియు ద్రవ్యోర్బనం వీటన్నిటిని పరిగణించి ఈ ధరలను నిర్ణయిస్తారు.

ఈ సంవత్సరం నూనె గింజలు మరియు పప్పుదినుసుల మీద ఎంఎస్పి భారీగా పెరిగింది. కొత్త ధరలు ఒక క్వింటాల్ కంది పప్పు మీద రూ.550, మినుములు మీద రూ. 450, పెసరపప్పు రూ 124. పెంపునకు ఆమోదం తెలిపారు. అలాగే ప్రధాన నూనె గింజలైనా వేరుశెనగ పై రూ.406, ప్రోదు తిరుగుడు రూ.520, సోయాబీన్ రూ. 292 ప్రతి క్వింటాల్కు పెంచడం జరిగింది. ఈ కొత్త ఎంఎస్ప్ ధరలు రైతులకు రేటింపు లాభాలను అందించే విధంగా ఆమోదించడం జరిగింది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం, చిరు ధాన్యాలు, పప్పు దినుసులు, మరియు నూనె గింజల సాగు మీద దృష్టి సారిస్తుంది, అంతర్జాతీయ మార్కెట్లలో వీటికి అధిక డిమాండ్ ఉండటం, మన దేశంలో వీటి సాగు విస్తీరణం తగ్గిపోవడం చేత, కేంద్ర ఈ పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశలో పనిచేస్తుంది. ఇందుకు తగ్గుగానే వీటికి అందిస్తున్న ఎంఎస్ప్ ని భారీగా పెంచింది. ఈ ఏడాది సజ్జలు సాగు చేసే రైతులకు కనీస మద్దతు ధర ద్వారా 77% లాభం, కందికి 59%, మొక్కజొన్న 54%, ఇంక మిగిలిన అన్ని పంటలకు కనీసం 50% లాభం చేకూర్చే విధంగా ఈ కొత్త ధరలను నిర్దేశించారు.

ప్రభుత్వం నిర్దేశించిన ఎంఎస్పి ధరలు ఈ విధంగా ఉన్నాయి

Crops

MSP
2024-25(Rs. per quintal)

Cost KMS
2024-25

Margin over
cost (%)

MSP
2023-24

MSP Increase
in 2024-25
over 2023-24

Cereals

 

 

 

 

 

వర

Common

2300

1533

50

2183

117

Grade A^

2320

-

-

2203

117

జొన్న

Hybrid

3371

2247

50

3180

191

Maldandi"

3421

-

-

3225

196

సజ్జలు

2625

1485

77

2500

125

రాగుల

4290

2860

50

3846

444

మొక్కజొన్న

2225

1447

54

2090

135

Pulses

 

 

 

 

 

కందిపప్పు

7550

4761

59

7000

550

పెసరపప్పు

8682

5788

50

8558

124

Crops

MSP
2024-25

Cost* KMS
2024-25

Margin over
cost (%)

MSP
2023-24

MSP Increase
in 2024-25
over 2023-24

 

 

 

 

 

 

మినపప్పు

7400

4883

52

6950

450

 

Oilseeds

 

 

 

 

 

 

వేరుశెనగ

6783

4522

50

6377

406

 

ప్రొద్దు తిరుగుడు

7280

4853

50

6760

520

 

సోయాబీన్

4892

3261

50

4600

292

 

నువ్వులు

9267

6178

50

8635

632

 

నిగర్

8717

5811

50

7734

983

 

Commercial

 

 

 

 

 

 

పత్తి

(Medium Staple)

7121

4747

50

6620

501

 

(Long Stapler

7521

-

-

7020

501

Share your comments

Subscribe Magazine

More on News

More