ఏపీలో వచ్చే ఎన్నికల వరకు రాజకీయ వాతావరణం అంతర్గమంగా మారుతోంది. ప్రతిపక్షంపై ఆధిపత్యం చెలాయించేందుకు ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి మార్చి ఎన్నికల వరకు పూర్తి స్థాయి రోడ్ మ్యాస్ సీఎం జగన్ పార్టీ శ్రేణులకు ఫిక్స్ చేసారు. తన ప్రచార సమయంలో ఇచ్చిన నవరత్నాల వాగ్దానాలను నెరవేర్చడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు.
ఈ నెల 12 అనగా నేడు ముఖ్యమంత్రి జగన్ ఐదు లక్షల ఇళ్లను ప్రారంభించనున్నారు, వీటన్నింటిని అర్హులైన మహిళా లబ్ధిదారులకు అందజేయనున్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు ఇళ్లను అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 12వ తేదీన సామర్లకోటలో పర్యటించనున్నారు.
సీఎం జగన్ రాష్ట్రంలోని పేదలకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంగా ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ..అందులో 21.31 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే 5 లక్షల 24 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి కావడం విశేషం.
నేటి నుంచి గురువారం నుంచి పూర్తి చేసిన ఈ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందజేయనున్నారు. సామర్లకోటలో జరిగే ఈ గృహనిర్మాణ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా పాల్గొననున్నారు. సామర్లకోటలో ప్రత్యేకంగా నిర్మించిన 2,412 ఇళ్లతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 5 లక్షల 24 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు.
ఇది కూడా చదవండి..
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ పథకం కింద అదనంగా మరో రూ.2 వేలు ?
పండుగ వాతావరణం నెలకొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసమయంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం అర్హులైన లబ్ధిదారులకు, ముఖ్యంగా మహిళలకు సుమారు రూ. 15 లక్షల విలువైన ఇళ్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటికి మహిళలను యజమానులుగా చేస్తున్నారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
మొత్తం 21.31 లక్షల ఇళ్ల నిర్మాణంలో భాగంగా మిగిలిన వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. విజయనగరం జిల్లాలో 36,128 మందికి, శ్రీకాకుళం జిల్లాలో 31,855 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం మొత్తం 26 జిల్లాల్లో జరుగుతోంది, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులు వారి ఇంటి ధృవీకరణ పత్రాలను స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది.
ఈ ఇళ్లలో ఎక్కువ శాతం, దాదాపు 54 శాతం బీసీ వర్గానికి చెందిన వర్గాలకు కేటాయించారు. అదనంగా, 20 శాతం ఇళ్లను ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 21 శాతం ఇతర అర్హులైన లబ్ధిదారులకు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేలకు పైగా జగనన్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. మిగిలిన ఇళ్లను కూడా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ నాటికి అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి..
Share your comments