రాష్ట్రంలో రైతులు అకాల వర్షాల కారణంగా భారిగా పంటలు నష్ట పోయిన విషాదం మనకు తెలిసిందే. అయితే వీరికి చేయూతన ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించాడని ఉతర్వులు జారీ చేసారు. అకాల వడగళ్ల వానలకు తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది.
ఇటీవల బాగా కురిసిన వడగళ్ల వర్షాలతో నష్టపోయిన ర్పల మండలంలోని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నష్టపరిహారంగా 1,71,72,000 రూపాయలను కేటాయించినట్లు మండల ఉద్యానవన శాఖాధికారిణి ఫాజులున్నీసా తెలియజేసారు.
నార్పల మండలంలో 668.43 హెక్టార్లలో అరటి పంట నష్టపోయిన 831 మంది రైతులకు మొత్తం 1,67,10,750 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు మండల ఉద్యానవన అధికారి ఫజల్ ఉన్నీసా తెలిపారు. అంతేకాకుండా 67 వేల 350 రూపాయలను 4.49 హెక్టార్లలో పంట నష్టపోయిన నలుగురు బొప్పాయి రైతులకు, 22 లక్షల 4 వేల 250 రూపాయలను 14.95 హెక్టార్లలో సాగు చేసిన 17 మంది టమాటా రైతులకుఅందించారు.
ఇది కూడా చదవండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులపాటు భారీ వర్షాలు !
8 వేల 700 రూపాయలను 0.4 హెక్టార్లలో కళింగర పంట నష్టపోయిన ఒక రైతుకు, 0.58 హెక్టార్లలో కలువ సాగు చేసిన ఇద్దరు రైతులకు కూడా పరిహారం అందించారు. నార్పల మండలంలో 699.18 హెక్టార్లలో వివిధ పంటలు నష్టపోయిన 872 మంది రైతులకు పరిహారం 1,71,72,000 రూపాయలను అందించగా, పూలు సాగు చేసిన ముగ్గురు రైతులకు 21,300 రూపాయలు కూడా మంజూరు చేశారు. నష్టపోయిన రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేశారు.
ఇది కూడా చదవండి..
Share your comments