తెలంగాణలో భూ రికార్డుల డిజిటలైసెషన్ లో భాగంగా తీసుకొచ్చిన ధరణిని పోరాటాలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు , ధరణి లోఓ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది , సాంకేతికపరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ధరణి పోర్టల్‌లో ఇప్పటికే 33 మాడ్యూళ్లు ఉండగా.. అదనంగా మరో 10 మాడ్యూళ్లు సమాచారం తెలియజేసేవి ఉన్నాయి.
తాజాగా ధరణి పోర్టల్‌లోని మాడ్యూళ్లకు సంబంధించి మార్పులు, చేర్పులపై రెవెన్యూ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోర్టల్‌లో నమోదైన సమాచారంలో తప్పులు, నమోదు కాని భూములను పొందుపరచడం వంటి ఈ 33 మాడ్యూళ్ల ద్వారా అనేక సమస్యలు, సేవలకు సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 'గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్', టీఎమ్-33 మాడ్యూళ్లతో ఏ సమస్య ఉన్నా దరఖాస్తు చేసుకునే వీలుంది. అయితే అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు చూపే మార్గదర్శకాలు పోర్టల్‌లో అందుబాటులో లేవు. దీనికితోడు దరఖాస్తు చేసిన ప్రతిసారీ రూ.1000కిపైగా రుసుం చెల్లించాల్సి రావడంతో రైతులపై అదనపు భారం పడుతోంది.
ఇప్పుడు అన్ని సమస్యలకు పరిశక్రం చూపే విధంగా కొత్త కమిషనర్ సారథ్యంలోని అధికారులతో ధరణి సమస్యలపై సమీక్షా జరుగుతుంది , వీలైనంత త్వరగా ధరణి సమస్యలకు సమాధానం దిశగా కసరత్తు చేస్తున్నారు .
రైతులకు శుభవార్త.. ధరణిలో FAQ ఆప్షన్ .. రైతుల అన్ని సమస్యలకు సమాధానం !
ధరణి గురించి :
తెలంగాణ ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో ప్రారంభించిన ఆన్‌లైన్ భూమి మరియు ఆస్తి రిజిస్ట్రేషన్ పోర్టల్. ధరణి పోర్టల్ యొక్క లక్ష్యం భూమి రికార్డులను డిజిటలైజ్ చేయడం, అవినీతిని తగ్గించడం మరియు భూమి లావాదేవీలను మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా చేయడం. పోర్టల్ పౌరులు భూమి మరియు ఆస్తి వివరాలను యాక్సెస్ చేయడానికి, భూమి యాజమాన్య ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, ఆస్తి పత్రాలను నమోదు చేయడానికి మరియు ఆన్‌లైన్‌లో స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. తెలంగాణ ప్రజలకు ఎటువంటి అవాంతరాలు లేని మరియు అవాంతరాలు లేని భూ రిజిస్ట్రేషన్ మరియు నిర్వహణ అనుభవాన్ని అందించడానికి ధరణి, రెవెన్యూ, సర్వే మరియు ల్యాండ్ రిజిస్ట్రేషన్ విభాగాలతో సహా అనేక ప్రభుత్వ సంస్థలతో ఏకీకృతం చేయబడింది.
Share your comments