తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగా రైతు భరోసాలో సీలింగ్ విధించిందని మనందరికి తెలిసిన విషయమే. తాజాగా ఈ సీలింగ్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమయ్యిందని తెలుస్తుంది.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది అమలుచేస్తామన్న రైతు భరోసా మరియు రుణమాఫీ ఇంకా చెయ్యలేదని ఒక పక్క ప్రతిపక్షాలు మరోపక్క రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా, దీనికి సమాధానంగా ఈ ఆగష్టు లోపు రైతులకు ఈ పధకాలు అందిస్తామని ప్రకటించారు. దేశంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఈ పథకాలను అమలుచేయడం సాధ్యపడలేదని, ఎలక్షన్ కోడ్ పూర్తవగానే రైతు భరోసా నగదును రైతుల ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసాలో సీలింగ్ విధించిందని మనందరికీ తెలిసిన విషయమే.
ఈ సీలింగ్ ప్రకారం, ఐదు ఎకరాలలో లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా లభిస్తుందని ప్రకటించింది, ప్రస్తుతం ఈ పరిమితిని సడలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. మొదట 5 ఎకరాలలో లోపు ఉన్న రైతులకు ఎకరానికి 7,500 రూపాయిలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పరిమితిని 10 ఎకరాలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు, ఎన్ని ఎకరాలు ఉంటె అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేవారు, దీనివలన కొందరు సామాన్య రైతులు నష్టపోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తరవాత రైతు భరోసాలో సీలింగ్ విధించడం జరిగింది. ఇప్పుడు ఈ సీలింగ్ లో కొన్ని సడలింపులు కాంగ్రెస్ ప్రభుతం సిద్దమయ్యింది. దీనికి సంబంధించి, ఎన్నికల ఫలితాల తరువాత క్యాబినెట్ సమావేశాల్లో మరియు బడ్జెట్ సమావేశాల్లో దీని గురించి చర్చించిన తర్వాత తుది నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తుంది.
Share your comments