తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది , తెలంగాణ రాష్ట్రంలో కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను రెగ్యూలరైజ్ చేసే ప్రక్రియను సవరించింది , గతంలో ఉన్న నిబంధనలను మరింతసరళీకృతం చేసి ఏప్రిల్ 1 నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరించనుంది .
సంవత్సరం నిబందను సవరించి దరఖాస్తు చేసుకున్న నాటి ప్రభుత్వ భూమి విలువ ప్రకారం డబ్బులను చెల్లించి రిజిస్ట్రేషన్ చేసి రెగ్యూలరైజ్ చేయనుంది . ఇందుకోసం ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ దాకా నెల రోజుల పాటు అప్లికేషన్లు తీసుకోనుంది. జీవో 58,59 కింద రాష్ట్ర సర్కార్ పలుమార్లు అప్లి కేషన్లు తీసుకుంది. జీవో నంబర్ 58 కింద 3.48 లక్షల అప్లికేషన్లు, జీవో నంబర్ 59 కింద 48,575 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం 3.96 లక్షల దరఖాస్తు లు రాగా, ఇందులో ఎక్కువ వరకు 2014 జూన్ 2 తర్వాత కబ్జాకు గురైన భూములకు సంబంధించిన వే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ అప్లికేషన్లను ఓకే చేసి, సర్కారు కటాఫ్ డేట్ ను మరింత పెంచింది.
రైతులను ఆందోళన కల్గిస్తున అకాలవర్షాలు .. మరో 2 రోజులు భారీ వర్షాలు !
ఇప్పటికే 3.96 లక్షల దరఖాస్తులు కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం గతంలో జీవో 58, 59 జీవోలు తెచ్చింది అయితే జీవో 58, 59 నిబంధనల ప్రకారం 2014 కన్నా ముందు కబ్జాకు గురయైనా ప్రభుత్వ భూములను రెగ్యూలరైజ్ చేయాలనీ తెచ్చిన జీవో 58, 59 తో 3.96 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు , ఇప్పుడు గతంలో ఉన్న 2014 నిబంధనను సవరించి కొత్త దరఖాస్తులు స్వీకరించనుంది దీనితో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నది.ప్రభుత్వం గతంలో జీవో 58, 59 జీవోలు తెచ్చింది అయితే జీవో 58, 59 నిబంధనల ప్రకారం 2014 కన్నా ముందు కబ్జాకు గురయైనా ప్రభుత్వ భూములను రెగ్యూలరైజ్ చేయాలనీ తెచ్చిన జీవో 58, 59 తో 3.96 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.
Share your comments