ఈ ఏడాది జరిగిన లోకసభ ఎన్నికల్లో, ఎన్డిఏ ప్రభుత్వం విజయఢంకా మోగించి, మూడోసారి తమ ప్రభుత్వాని ఏర్పరుచుకుంది. ప్రధాన మంత్రి. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ సారి కూడా ఆర్ధిక మంత్రిగా నిర్మల సీతారామన్ ఎన్నికయ్యారు. అయితే ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టవల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు, అయితే ఈ ఆర్ధిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ జులై లేదంటే ఆగష్టు నెలలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
మరోకొద్దీ రోజుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ రానున్న రోజుల్లో, ఈ సారి బిడ్జెట్లో కొన్ని రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఎంఎస్ఎంఈ, వ్యవసాయ పరిశోధన, మరియు రంగాలపై వారికి మద్దతు ఇచ్చేలా బడ్జెట్ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రంగాలకు సంబంధించిన ప్రతినిధుల నుండి కూడా ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయి. దేశంలో పారిశ్రామిక రంగాన్ని వృద్ధి చేసి, ఉద్యోగ అవకాశాలు పెంచాలన్న ఉదేశ్యంతో ప్రభుత్వం ఎంఎస్ఎంఈ లకు ఎన్నో విధాలుగా ప్రోత్సహకాలు అందిస్తుంది, వీరికి అవసరమైన శిక్షణ మరియు పెట్టుబడి సహాయం ప్రభుత్వం అందించే కార్యక్రమం చేపట్టింది, అయితే కొన్ని కారణాల వలన పేమెంట్ ఆలస్యం కావడంతో చిన్న సంస్థలు నష్టపోతున్నాయి. ఈ పరిస్థితిని నియంత్రించడానికి 45 రోజుల్లోగా పేమెంట్ వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎంఎస్ఎంఈ ప్రతినిధులు ప్రభుత్వాని కోరినట్లు తెలుస్తుంది. దీనితోపాటు ఈ చిన్న సంస్థలకు ఇన్సెంటివ్స్, ప్లాంట్ మెషినరీ, ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నారు. దీనితోపాటు ఇంటర్నేషనల్ ట్రేడ్ మరియు డిజాస్టర్ మానేజ్మెంట్ సపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాని కోరుతున్నారు.
దేశ్ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మారుతున్న కాలానికి మరియు ఆహారపు అలవాట్లలో భాగంగా వ్యవసాయంలో ఎన్నో మార్పులు చెయ్యవలసిన అవసరం ఉంది. వ్యవసాయ అభివృధిని ప్రోత్సహించే విధంగా ఈ సారి బడ్జెట్లో వ్యవసాయ పరిశోధన రంగంలో పెట్టుబడులు పెంచాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచేందుకు యంత్రాల అవసరం చాలా ఎక్కువుగా ఉంటుంది, దీని కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మరియు ఎరువులపై ఇచ్చే సబ్సిడీల హేతుబద్దీకరణపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు, దీనికోసం వ్యవసాయ బడ్జెట్ను 9 వేల కోట్ల రూపాయిల నుండి 20 వేల కోట్లకు పెంచాలని వ్యవసాయ ప్రతినిధులు కోరుతున్నారు.
వ్యవసాయ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం. వ్యవసాయ రంగం అభివృద్ధికి ఖర్చు చేస్తే వ్యవసాయ వృద్ధి రేటు పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు తీసుకోని రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఎగుమతుల మీద కూడా ప్రభుత్వం ద్రుష్టి పెట్టాలి. వ్యవసాయ మరియు ఇతర రంగాల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చెయ్యడం ద్వారా ఆయా రంగాల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఎగుమతుల విషయంలో ఆర్ధిక సహకారం అందించాలని ఎక్సపోర్ట్ కంపెనీలు ప్రభుత్వాని కోరుతున్నాయి. 2030 నాటికి దేశ ఎగుమతులని రెండు వేల ట్రిలియన్ డాలర్లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది.
Share your comments